పోచమ్మ తల్లి చల్లగా దీవించమ్మ
— అధికారికంగా బోనాల ఉత్సవాలు
— అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి…
మహబూబ్ నగర్ ,జూలై , ( జనంసాక్షి ) :
పోచమ్మ తల్లి అందరినీ చల్లగా దీవించాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మ వారు కృప చూపాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రార్థించారు. రవీంద్ర నగర్ లోని శ్రీ పోచమ్మ దేవి, శ్రీ శీతల దేవి ఆలయం 32వ వార్షికోత్సవం మరియు ఆశాడ బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని రామ్ మందిర్ చౌరస్తా నుంచి రవీంద్ర నగర్ పోచమ్మ దేవి గుడి వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి నివాసానికి గుడి ఎదుటే గది నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.కర్యాక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, స్థానిక కౌన్సిలర్ వేదవ్రత్, గుడి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు తదితరులు పాల్గొన్నారు.