పోచమ్మ తల్లీ

అమ్మవారి ఆభరణాలకు మొక్కుతున్న భక్తులు

• తరలివచ్చిన భక్తజనం

• ప్రారంభమైన గంగనీళ్ల జాతర

• గోదావరి నదికి చేరిన అమ్మవారి నగలు

సారంగపూర్(నిర్మల్) , సెప్టెంబర్ 2, జనం సాక్షి: అడెల్లి మహాపోచమ్మ గంగ నీళ్ల జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ చందు, ఆలయ ఇన్చార్జ్ ఈవో రంగు రవి కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయంలో ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం అడెల్లి, కొట్ల(బి) సారంగాపూర్ అడెల్లి గ్రామాలకు చెందిన సేవాదారులు తలపై అమ్మవారి ఆభరణాల మూటతో కాలినడకన బయలుదేరారు. భక్తజన సందోహం నడుమ ఊరేగింపుగా దిలావర్ పూర్ మండలం సాంగ్వీ వద్ద గల గోదావరి నదికి పయనమయ్యారు. మండలంలోని అడెల్లి, సారం గాపూర్, యాకర్పల్లి, వంజర్, ప్యారమూర్, గ్రామాల మీదుగా దిల్వార్పూర్ మండలంలోని కదిలి, మాటేగాం, దిల్వార్పూర్, కంజర్, సాంగ్వి గ్రామాల గుండా రాత్రివరకు ఊరేగింపు గోదావరి నదికి చేరుకుంది.

హారతులతో స్వాగతం

ఆభరణాల ఊరేగింపునకు ఆయా గ్రామాల్లో భక్తు లు మంగళహారతులతో స్వాగతం పలికారు. పలువురు పార్లు దండాలు పెట్టారు. గంగపుత్రులు వలలతో గొడుగు పట్టి అమ్మవారి అనుగ్రహానికి పాత్రు లయ్యారు. డీఎస్సీ జీవన్ రెడ్డి, నిర్మల్ రూరల్ సీఐ వెంకటేశ్, సారంగాపూర్ ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి ఆధ్వ ర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆదివారం
సూర్యోదయానికి ముందే నగలను పవిత్ర గోదావరి నీటితో జలాభిషేకం అనంతరం తిరిగి బయలుదేరు. తారు. ఇవే గ్రామాల మీదుగా ఊరేగింపుగా సాయంత్రానికి నగలు, గంగాజలాలతో ఆలయానికి చేరుకోవడంతో జాతర ముగియనుంది. గడముంతల్లో గంగాజలాలు
అమ్మవారి ఆభరణాల వెంట గోదావరికి బయల్దేరిన భక్తులంతా తమ వెంట తీసుకెళ్లిన గడముంతల్లో గంగా జలాలను వెంట తీసుకుని వస్తారు. ఈజలాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం ఆ మ్మవారికి అభిషేకం జరిపి వీటిని ఇళ్లలో, పంటపా లాల్లో చల్లుకుంటారు. దీంతో పాడిపంటలు, పిల్లా పాపలు సల్లగా ఉంటారని భక్తుల విశ్వాసం. గతేడా ది కరోనా ప్రభావంతో భక్తుల సంఖ్య తగ్గగా… ఈసారి లక్ష మంది వరకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక జెడ్పీ టీసీ సభ్యుడు రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, సర్పంచ్లు సుచరిత, సుజాత, ఏఎంసీ అధ్యక్షుడు. అశ్విత శ్రీనివాస్ రెడ్డి సొసైటీ చైర్మన్ లు నారాయణరెడ్డి మాణిక్ రెడ్డి మాధవ్ పార్టీ కన్వీనర్ మాధవరావు, ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి నేతత్వంలో జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ఆల య ధర్మకర్తలు, ఇంచార్జ్ ఈఓ రంగు రవి కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.