పోడు రైతుల ఆందోళన ఉద్రిక్తం.
పోలీసులకు రైతులకు మధ్య తోపులాట.
ఎంపీటీసీతో సహా పలువురు నాయకుల అరెస్ట్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 17. (జనం సాక్షి). గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పోడు రైతులకు పట్టాలి ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తానండి కరెక్టరెట్ వరకు బుధవారం పాదయాత్ర చేపట్టారు. అనంతరం కలెక్టరెట్ ఎదుట బైఠాయించిన రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలిస్తామనిచెప్పి ఏడాది గడుస్తున్న ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పట్టాల విషయంలో కలెక్టర్ కు తమ గోడు చెప్పేదాకా కదిలేదిలేదంటు ఆందోళన చేపట్టారు. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విర్ణపల్లి ఎంపీటీసీ మాల్లారపు అరుణ్, సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్, కోడం రమణ,ఎగమంటి ఎల్లారెడ్డి, కేవిపీఎస్ నాయకులు ఎరవల్లి నాగరాజు తో పాటు పలువు నాయకులఅరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. ప్రజాస్వామ్య యుతంగా సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తుంటే అక్రమంగా అరెస్టు చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు.