పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

ప్రజారక్షణ, శాంతి భద్రతలే పోలీసుల లక్ష్యం
– అశ్వరావుపేట లో కొవ్వొత్తుల ర్యాలీ

 

అశ్వారావుపేట , అక్టోబర్ 21( జనం సాక్షి): పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని, ప్రజా రక్షణ, శాంతిభద్రతలే పోలీసుల లక్ష్యంగా ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి పనిచేస్తూ ఎందరో అమరులైన వారందరిని స్మరించు కుందాం…శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ కార్యాలయం లో జరిగిన సంస్మరణ దినోత్సవం లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో రింగ్ రోడ్డు సెంటర్ నుండి ప్రధాన రహదారి వెంట కొవ్వొత్తులతో పోలీసులు, విద్యార్థులు,ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బి రాజేష్ కుమార్, సాయి కిషోర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.