పోలీసు అమ‌ర‌వీరుల‌కు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ బ్యూరో, అక్టోబర్ 21:జనంసాక్షి,,    విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అక్టోబర్ 21, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా  ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి  అమరుల సేవలను మంత్రి స్మరించుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డిన పోలీస్ అమరుల సేవలను ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు.
 అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి గుర్తు చేశారు. అనంతరం రక్తదాన శిభిరాన్ని మంత్రి సందర్శించారు.
Attachments area