పోస్టర్ ఆవిష్కరణ

నల్గొండ బ్యూరో. జనం సాక్షి ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ జిల్లా అధికారులతో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వయోవృద్ధుల పట్ల ప్రేమ ఆధార అభిమానులతో కలిగి ఉండాలని వారి పట్ల నిర్లక్ష్యంగా వివరించినటువంటి కుటుంబ సభ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవాలను ఈరోజు నుండి జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రేపు వయోవృద్ధుల కోసం ఆటల పోటీలు వివిధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధుల కోసం నిర్వహించడం జరుగుతుందని 26 నాడు వయోవృద్ధుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని 27 నాడు జిల్లా అధికారులకు సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది 28 నాడు జిల్లాలోని సర్పంచులకు వయోవృద్ధుల చట్టంపై అవగాహన కార్యక్రమం 29 నాడు అవ్వతాతమ్మలడే గ్రాండ్ పేరెంట్స్ డే గా నిర్వహించడం జరుగుతుంది 30రోజు మారతాన్ వాక్ అవగాహన నడక సీనియర్ సిటిజన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అక్టోబర్ 1 నాడు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం జిల్లాలో గుడిపల్లి గ్రామం పీఏ పల్లి మండలం దేవరకొండలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వయోవృద్ధుల కోసం 14567 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా వారిచ్చే సమాచారము సేవలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సి సుభద్ర , ఆర్డీవో జగన్నాధ రావు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నాగిరెడ్డి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్, కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు