*ప్రకృతి విలయాన్ని దైర్యంగా ఎదుర్కోవాలి,*

*కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ
ముంపు గ్రామాల కుటుంబాలకు కూరగాయల పంపిణీ,*

వాజేడు జూలై18 జనంసాక్షి:
వాజేడు మండలం లో  గోదావరి వరద  ముంపు గ్రామాలైన దూలాపురం సుందరయ్య కాలనీ ఇప్పగూడెం గ్రామాల్లోని గోదావరి వరద ముంపు బాధిత150 కుటుంబాలకు వెంకటాపురం మండలంలోని కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ దాతలు సహకారంతో సీపీఎం పార్టీ మండల కమిటీ కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యం ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది, ఈసందర్భంగా కాఫెడ్ సంస్థ డైరెక్టర్ బ్రదర్ లూర్డు రాజు మాట్లాడుతూ ఇటీవలే వారం రోజులుగా కురిసిన వర్షాలకు వలన మండల వ్యాప్తంగా  అపారనష్టం జరిగిందని ఈ నష్టం వల్ల బాధిత కుటుంబాలు ఇప్పట్లో కోలుకోవడం అసాధ్యం అని అన్నారు, మా వంతుగా ఈ చిరు సహాయాన్ని స్వీకరించాలని ప్రజలను కోరుతూ గ్రామాల్లోని ప్రజలంతా ఈ కష్టకాలంలో దైర్యంగా ఉండాలని సూచించారు,ఈకార్యక్రమంలో కాఫెడ్ సంస్థ యాజమాన్యం బ్రదర్ బాబు,హనుమంత,కామేశ్వరరావు, స్వరూప,రమాదేవి,పద్మ,నరేష్,ప్రశాంత్,సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి, నాయకులు దామోదర్, కృష్ణబాబు,తదితరులు పాల్గొన్నారు,