ప్రకృతి వ్యవసాయంపై పూర్తిచేసుకున్న రైతులకు సర్టిఫికెట్ అందిస్తున్న కేవీకే శాస్త్రవేత్తలు

గరిడేపల్లి, అక్టోబర్ 21 (జనం సాక్షి): శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో పకృతి వ్యవసాయంపై రెండు రోజులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జాతీయ జల సాధన సమితి అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణ పాల్గొని రైతులు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ఆవుల పాత్ర వివిధ రకాల కలుపు మొక్కల యొక్క వినియోగం వ్యవసాయానికి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో  తెలిపారు. తరువాత సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి జానిమియా  ప్రకృతి వ్యవసాయంలో 365 రోజులు అచ్ఛాదన కలిగి ఉండాలని దీని ద్వారా భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి  భూసారం పొందుతుందని తెలిపారు. తరువాత ఆదర్శ్ కేవీకే సస్య రక్షణ శాస్త్రవేత్త ప్రకృతి వ్యవసాయంలో చీడపీడల నివారణకై వాడే జిగురు అట్టలు లింగాకర్షణ బుట్టలు యొక్క ప్రాముఖ్యత జీవ నియంత్రణ పద్ధతుల గురించి తెలియడం జరిగిందన్నారు.కిరణ్ మృత్తిక శాస్త్రవేత్త ప్రాక్టికల్ గా జీవామృతం వేస్ట్ డీ కంపోజర్ వివిధ కషాయాలు తయారీ రైతులతో చేయించడం జరిగింది. తరువాత కెవికె ఇంఛార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్  లవ కుమార్ జీవన ఎరువును అందించే అజోల్లా పెంపకాన్ని తెలియచేశారు. చివరగా ఈనాటి శిక్షణలో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై రైతులు నేర్చుకున్న అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. కే.వీ.కే ఇన్చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లవకుమర్ కుమార్ చేతులమీదుగా శిక్షణ అభ్యర్థులకు  ప్రకృతి వ్యవసాయం యొక్క పుస్తకం వేస్ట్ డీ కంపోజర్ బాటిల్ శిక్షణ పూర్తి చేసుకున్నందున సర్టిఫికెట్స్ అందజేయడం జరిగిందన్నారు .  ఈ కార్యక్రమంలో కె.వి.కె శాస్త్రవేత్తలు కిరణ్,నరేష్, మాధురి, ఆదర్శ్,  నరేశ్, సుగంధి రైతులు నరేశ్, రామకృష్ణ, సైదులు, వెంకటేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Attachments area