ప్రగతి సింగారంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్ ముట్టడి
శాయంపేట: ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచటాన్ని నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో మండలంలోని ప్రగతి సింగారంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగు యువత అధ్యక్షుడు మారపల్లి రవీందర్ మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీలను పెంచిన ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేయాలని, అలాగే పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.