ప్రజలపై పన్నుల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
మోత్కూరు జూలై జనంసాక్షి : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు తుంగతుర్తి శాసన సభ్యుడు డా.గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో
పాలు, పాల ఉత్పత్తుల, నిత్యా అవసరాల వస్తువుల పైన చరిత్ర లో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన జీఎస్టీ ని నిరసిస్తూ టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు
పొన్నెబోయిన రమేష్ మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారులపైనా, నిత్యావసర వస్తువుల పైన రైతులు,ప్రజలు,సామాన్యులపైన, ఎన్నడు లేని విధంగా పన్నుల భారాన్ని మోపుతున్నారు,రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వనికి తెలంగాణ ప్రజలు తాగిన బుద్ది చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో
మార్కేట్ కమిటీ ఛైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి,
మున్సిపల్ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, మాజీ మార్కెట్ ఛైర్మన్
తీపిరెడ్డి మేఘారెడ్డి,సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు
రాంపక నాగయ్య,మున్సిపల్ ప్రధాన కార్యదర్శి
గజ్జి మల్లేష్,గ్రంధాలయ కమిటీ ఛైర్మన్
కోమటి మచ్చగిరి,6వర్డ్ కౌన్సిలర్
వనం స్వామి,మండల యూత్ అధ్యక్షులు
గణగాని రాజేష్,జిల్లా నాయకులు
మర్రి అనిల్,దామరోజు శ్రీకాంత్ చారి,
నాయకులు బోడ శ్రీను,గణగాని శ్రీశైలం, వర్రే రాములు,కూరేళ్ళ రమేష్,కూరేళ్ళ ఇంద్రశేఖర్,దాసరి నరేష్,జిట్ట సాయికుమార్, దాసరి నవీన్,బందెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Attachments area