ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్, జంపన్న
టౌన్ జూలై 11 (జనంసాక్షి);
      జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇస్లవత్
దేవన్, అధికార ప్రతినిధి జంపయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడరు.
 తెలంగాణను రెడ్ అలెర్ట్ గా ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గత ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అత్యవసర సమయమైతే తప్ప బయటకి రాకూడదన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ , అధికారులకు మాజీ మంత్రివర్యులు  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు  ప్రజలకు అందుబాటులో ఉండాలని వారికి సూచించడం జరిగిందన్నారు. నివాస ప్రాంతాల్లో నీరు నిలవకుండా చూడాలని లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు కూడా అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ పోరిక సమ్మయ్య ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ బుర్ర కొమురయ్య పొన్నగంటి శ్రీనివాస్ బౌతు రాజేష్ కంచర్ల సదానందం మధుకర్ రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు