ప్రజలు కోవిడ్ మరియు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

డాక్టర్.బి. సాంబశివ రావు, డి‌ఎం‌హెచ్‌ఓ.
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు08:-
వర్షా కాలంలో  నీరు నిల్వ ఉండటం, పరిసరాల పరిశుభ్రత లోపించడం వలన వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తాయని  ఇoదుకు వైద్య ఆరోగ్య శాఖ మరియు పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా గ్రామీణ అభివృద్ధి శాఖలు వివిధ చర్యలు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నవని అయితే ఇందులో ప్రజల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.బి. సాంబశివ రావు ఒక ప్రకటనలో తెలిపారు. దోమల ఉత్పత్తిని తగ్గించడానికి, ఇంటి పరిసరాలలో నీరు  నిలువఉండకుండా చూడాలని గుంటలను మట్టితో పూడ్చి వేయాలని ఇంట్లో, ఇంటి చుట్టు పనికిరాని కూలర్లు, పాత డ్రమ్ములు, వాడని రోళ్ళు, కొబ్బరి చిప్పలు, పగిలిన కుండలు, సీసాలు లేకుండా చూసుకోవాలని కిటికీలకు, డోర్ లకు మేష్ లు బిగించుకోవాలని నీరు నిల్వ ఉన్న గుంటలలో క్రిమిసంహారక మందులు, కిరోసిన్లో లేదా వాడిన ఇంజన్ ఆయిల్ లో ముoచిన గుడ్డ వుండలు (ఆయిల్ బాల్స్) వేయాలి. దీనితో దోమ లార్వాలు,  ఆక్సిజన్ అందక చనిపోతాయి. వారానికి ఒక రోజు డ్రైడే గా పాటించి ఇంటి లోగల వంట పాత్రలు, నీటి డ్రమ్ములు నీరు నిల్వ ఉంచే ఇతర పాత్రలను ఖాళీ చేసి తోమి ఆరబెట్టి తిరిగి నీరు నిల్వ చేసుకోవాలని  అలాగే దోమలు కుట్టకుండా వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే త్రాగు నీరు కలుషితం కావడం ద్వారా అతి సారం, వాంతులు లాంటి వ్యాధులు రావచ్చు. వీటిని నివారించడం కోసం  తప్పనిసరిగా క్లోరినేషన్ చేసిన లేదా కాచి చల్లార్చి వడపోసిన నీటిని త్రాగుటకు ఉపయోగించాలని మల మూత్ర విసర్జన అనంతరం, భోజనానికి ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని వేడి వేడి  ఆహార పదార్థములు భుజించాలని ఆహార పదార్థాలపై మూతలు సరిగా ఉంచాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, రోడ్ల వెంబడి అమ్మే తినుబండారాలు, పానీయాలు తీసుకోకూడదు. వాంతులు, విరేచనాల రూపంలో శరీరము నుండి, లవణాలు, నీరు బయటకు వెళ్లడం వలన వాటి భర్తీకి వెంటనే లవణములు కలిగిన ఓఆర్ఎస్ ద్రావణాన్ని గంటగంటకూ త్రాగించాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం ల వద్ద, ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా లభిస్తాయి. పైన పేర్కొన్న వ్యాధులు ఏ గ్రామంలోనైనా ఒకే సమయంలో ఎక్కువమందికి ఉన్నట్లయితే వెంటనే సంబంధిత వైద్యాధికారి లేదా జిల్లాలోని ఎపిడమిక్ సెల్ కు సమాచారాన్ని అందించాలి. కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నoదున ప్రజలందరూ తప్పకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సరైన పద్ధతిలో మాస్కు ధరించాలి, గుంపులుగా ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలి. చేతుల్ని వీలైనన్నిసార్లు సబ్బుతో లేదా శానిటైజర్ శుభ్రపరుచుకోవాలి. 18 సంవత్చరాల పై బడి మొదటి మరియు రెండవ డోసు తీసుకొని 6 నెలలు పూర్తి అయిన వారు తప్పనిసరిగా ప్రీకాషనరి (బూస్టర్ డోసు ) తీసుకోవాలి. 15 నుండి 18 సo.ల వయస్సు కల  పిల్లలు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలి. జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు  ఉన్నా తప్పనిసరిగా దగ్గరలోని ఆరోగ్యకేంద్రంలో కోవిడ్ పరీక్ష  చేయించుకోవాలి. పాజిటివ్ వచ్చిన వారు ఇతరులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి, హనుమకొండ జిల్లా
జిల్లా పౌర సంబందాల శాఖాధికారి ద్వారా వివరాలు వెల్లడించారు.