ప్రజలు పోలీసులకు సహకరించినప్పుడే అందరికీ సరైన న్యాయం జరుగుతుంది

మోమిన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం
మోమిన్ పేట జూలై 15 (జనం సాక్షి)
ప్రజలు పోలీసులతో స్నేహపూర్వకంగా ఉండి ప్రతి విషయంలో సహకారం అందించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని మోమిన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం పేర్కొన్నారు శుక్రవారం మండల పరిధిలోని కాసులాబాద్ గ్రామంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న గొడవలు తగాదాలు వంటి వాటికి నేరం చేసిన వాళ్లే ముందుగా పోలీస్ స్టేషన్ కు రావడంతో బాధితులకు సరైన న్యాయం చేయలేకపోతున్నామని అందువల్లనే ప్రజలు పోలీసులతో స్నేహపూర్వకంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు గ్రామంలో ప్రతి యువకు లు ప్రజా ప్రతినిధులు పోలీసులకు సహకారం అంది స్తే ఫ్రెండ్లీ పోలీస్ విధానం విజయవంతంగా అమలు చేయవచ్చు అన్నారు నేరాల నియంత్రణకు చదువుకున్న యువకులు ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ సహకారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యమ్మ నరసింహులు మోమిన్ పేట ఎస్ఐ విజయ ప్రకాష్ ఏ ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు