ప్రజల ఫిర్యాదులపై అలసత్వం వద్దు
జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి
భూపాలపల్లి బ్యూరో అక్టోబర్ 10 (జనంసాక్షి):
ఏ సమయంలోనైనా ప్రజలు, బాధితులు, వారి వారి సమస్యలపై ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, చట్టపరిధిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 20 మంది బాధితులు, వారి సమస్యలను ఎస్పి దృష్టికి తీసుకెళ్లగా,వారి సమస్యను అడిగి తెలుసుకునీ, పరిష్కారం కోసం సంబందిత పోలీస్ స్టేషన్ కు బదలయించి, తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు అధికారులు, మహిళా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. బాధితులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించుకోకుండా సకాలంలో న్యాయం చేయాలన్నారు, అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన వాటిని యాప్ లను మాత్రమే సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు