ప్రజావాణికి ప్రాధాన్యత నివ్వాలి …….జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
ప్రజావాణిలో ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్
సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 10:(జనం సాక్షి):
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు.
సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ధరఖాస్తుదారుల నుండి అదనపు కలెక్టర్లతో కలిసి ఆర్జీలను స్వీకరించారు.
ప్రజావాణికి వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారుల సమస్యలను పరిష్కరించడం పై సంబంధిత అధికారులు చొరవ చూపాలని సూచించారు.
తమ పరిధిలో పరిష్కరించగలిగిన సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. తమ పరిధిలో పరిష్కారం కానట్లైతే అట్టి విషయాన్ని అర్జిదారుకు తెలుపాలన్నారు. వచ్చిన ఆర్జీలన్నింటినీ వెంట వెంటనే పరిష్కరించాలని, జాప్యం చేయరాదని తెలిపారు.
ప్రజలు వివిధ సమస్యలపై 28 ఆర్జీలు అందజేశారు.
త్రి బుల్ ఆర్ వెళుతున్న గ్రామాల్లో రైతులు భూములు కోల్పోయి నష్టపోతున్నారని ప్రజావాణిలో
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తన బృందంతో వచ్చి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రతినిధులు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు.
ప్రజావాణి లో భూ సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,రుణం మంజూరీ, తదితర అంశాలపై ఆర్జీలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి ,
డి ఆర్ ఓ రాధికా రమణి,
వివిధ శాఖల జిల్లా అధికారులు,ఆర్జీ దారులు పాల్గోన్నారు.