ప్రజావాణికి హాజరు కాని అధికారులకు తాఖీదులు జారీ చేస్తాం ‌..

అదనపు కలెక్టర్లు శ్రీవత్సవ, హరి సింగ్…
ఫోటో రైటప్: ప్రజావాణి దరఖాస్తులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్లు…
వరంగల్ బ్యూరో: జూలై   (జనం సాక్షి)

ప్రజావాణికి హాజరుకాని అధికారులపై తాకీదులు జారీ చేస్తూ దానికనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని  ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్లు శ్రీవత్సవ కోట, హరి సింగ్ అధికారులను ఆదేశించారుు.

సోమవారం  జిల్లా కలెక్టర్ సమావేశ హాలులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడమైనది.
  దూర ప్రాంతాల నుండి ప్రజలు వారి సమస్యలపై ప్రజావాణిలో దరఖాస్తులు  అధికారులకు విన్నవించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు సుపరిపాలన లక్ష్యంగా ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై దృష్టిసారించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని అప్పుడే ప్రభుత్వ అధికారులపై ఒక నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు.
 అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట మాట్లాడుతూ ప్రజావాణికి అధికారులు సమయపాలన పాటించి తప్పనిసరిగా హాజరు కావాలని  ప్రజావాణిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బందు, పై ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని ప్రజల నుండి వివిధ సమస్యలపై 32 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు.
 కీటక జనిత వ్యాధుల నుండి ప్రజలను రక్షించడం కొరకు శానిటేషన్ పై దృష్టి సారించాలని హెల్త్ క్యాంపులు ద్వారా ప్రజలకు వైద్య చికిత్సలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ ను ఆదేశించారు.
భూ సంబంధిత సమస్యలపై నిబంధనల మేరకు ధరణి వెబ్సైట్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు.
 ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సంపత్ రావు , ఆర్ డి ఓ మహేందర్ జి జిల్లా పంచాయతీ అధికారి స్వరూపరాణి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.