ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం
జగిత్యాల, జూన్4 (జనంసాక్షి): ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిం చడం జరుగుతుందని జగిత్యాల రెవెన్యూడిజినల్ అధికారి యం . హనుమంతరావు అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఆయన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కొరకే ప్రజా వాణికార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 16 మంది ధరఖస్తు చేసుకోవడం జరిగిందన్నారు. మెట్పల్లి మండలం గాజులపేటకు చెందిన పుల్లా రాజాగౌడ్ సర్వేనం.853 ఆలో అక్ర మంగా నిర్మాణాలు చేపడుతున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకోవలసిందిగా, వెల్లుల్లకు చెందిన దళితులు వెల్లుల్ల గ్రామంలో చాలా కాలం క్రితం గుడిసెలు నిర్మించుకోవడం జరిగిందని అట్టి స్థలంలో నివాసముండుటకు పట్టాలు ఇప్పించవలసిందిగా, కొరుట్ల పట్టనానికి చెందిన ఇల్లుటపు పెద్దనర్సయ్య సర్వే నం 1163 లో ఒక ఎకరం భూమిని పహానీలో నమోదు చేయవలసిందిగా , జగిత్యాల అరవింద్ నగర్‌కు చెందిన వంగల భగవత్‌గీత అనే వితరతవు కుటుంబపోషణ నిమిత్తం అంగన్‌వాడి కార్యకర్తగా ఉపాదికల్పించవలసిందిగా , జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందినశ్రీరాం చినరాజం ఇంటిపై నుండి కరెంట్‌తీగలు వెల్తున్నం దున వెంటనే తీసివేయవలసిందిగా అభ్యర్థించినారు. సంగెంపల్లికి చెందిన పత్తిపాక చంద్రయ్య హబ్సిపూర్‌లో మామిడితోట ఆర్టిక ల్చర్‌ద్వారా సాగుచేయుటకు ప్రభుత్వం అనుమతించిన రెవెన్యూ అధికారులు సంబంధిత అదికారులు ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులు ఇవ్వడంలేదని తగు చర్యలు తీసుకోవలసిందిగా, జగిత్యాల ఆటో యూనియన్ సభ్యులు ప్రబుత్వంద్వారా ఇండ్లు ఇండ్ల స్థలాలు ఆటోలు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సలు ఇప్పించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ పరిపాలనా అధికా రి మహేంధర్, డివిజనల్ పంచాయితీ అధికారి గౌస్ మోహిముద్దిన్ ,హౌసింగ్ డీఈ వాసం ప్రసాద్, టీ భూమేష్, డీఈఈ పంచాయి తీరాజ్, మున్సిపల్ కమీషనర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.