ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదు

మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు
సమన్వయంతో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తాం
సీఎంల సమావేశంలో ప్రధాని మన్మోహన్‌
న్యూఢల్లీి, జూన్‌ 5 (జనంసాక్షి) :
ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. హింసాత్మక సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని పేర్కొన్నారు. ఢల్లీిలోని విజ్ఞాన్‌ భవనంలో బుధవారం ప్రధాని మన్మోహన్‌ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యమంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. నక్సల్స్‌ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. ఛత్తీస్‌గఢ్‌ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇటీవల ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల హింసాకాండలో పలువురు కాంగ్రెస్‌ నేతలతో సహా అమాయకులు బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో హింసకు తావులేదన్నారు. హింసావాదంతో ఏదీ సాధించలేమని, అది అభివృద్దికి ఆటంకంగా మారిందన్నారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పెంచడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నామన్నారు. మావోల దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదం, భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొనేందుకు రాష్టాల్రతో కలిసి పని చేస్తామన్నారు. ఈ నెల 10వ తేదిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సమావేశం ఉంటుందన్నారు. 34 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టుల దాడులు తగ్గాయని చెప్పారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి దారుణమని, నక్సల్స్‌ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధాని తెలిపారు. వామపక్ష తీవ్ర వాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పారు. అయితే తీసుకుంటున్న చర్యల కారణంగా గత రెండేళ్లలో నక్సల్స్‌ హింస తగ్గిందన్నారు. నక్సల్స్‌ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని, కేంద్రానికి రాష్టాల్ర పూర్తిస్థాయిలో సహకారాలు అందించాలని కోరారు. జమ్మూ`కాశ్మీర్‌లో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో స్త్రీలపై దాడులు పెరిగాయని వాటిని కఠినంగా అణచివేయాలన్నారు. పిల్లు, స్త్రీల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సిఎంలకు సూచించారు. దేశంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెసు నేతల పైన మావోయిస్టుల దాడి ప్రజాస్వామ్యం పైన దాడిగా అభివర్ణించారు. ఈశాన్యంలో శాంతి కార్యక్రమాల ద్వారా హింసను తగ్గిస్తున్నట్లు` చెప్పారు. తీవ్రవాదులు హవాలా, వెస్టన్ర్‌ యూనియన్‌ ద్వారా నిధులను అందుకుంటున్నారని షిండే తెలిపారు. నక్సల్స్‌ సమస్యను ఉపేక్షించమని, కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆయుధాలు వదిలి వచ్చే ఏ తీవ్రవాద సంస్థతోనైనా చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరులో రాష్టాల్రకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. నక్సల్‌ సమస్యపై కఠిన వైఖరి అవలంబిస్తామని చెప్పారు. దేశంలో శాంతిభద్రతలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కాగా, ఢల్లీిలో జరిగిన ముఖ్యమంత్రుల అంతర్గత సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీహాజరు కాలేదు. ఆయా రాష్టాల్ర ముఖ్యమంత్రులు, డిజిపిలు హాజరయ్యారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ బద్కటీకి కేంద్ర హోంశాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, రాష్టాల్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో మొత్తం 12 అంశాలపై చర్చ జరగనుంది. నక్సల్స్‌ సమస్యను ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాన్ని రూపొందించడంపై నేతలు దృష్టి సారించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టుల దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు.
ద్విముఖ వ్యూహంతో మావోయిస్టుల అణచివేత
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు కాపాడడం వల్లనే ప్రగతి సాధ్యమని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఢల్లీి సిఎంల సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణ కల్పించడంతో పాటు శాంతిని నెలకొల్పడమే ప్రభుత్వాల విధి అన్నారు. అంతర్గత భద్రతతో పాటు దేశం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను చర్చించే అవకశాం ఈ సమావేశం ద్వారా కలిగిందన్నారు. దేశం వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రదాని నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. దేశంలో వామపక్షతీవ్రవాదంతో పాటు, టెర్రరిజం కూడా సవాల్‌గా మారిందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండు సమస్యలను సమర్థంగా ఎదుర్కొటున్నామని కిరణ్‌ చెప్పారు. గత 40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోందన్నారు. మావోయిస్టుల గెరిల్లా పోరాటాలకు దీటుగా బలగాలు కూడా అదే పద్ధతిలో ఎదుర్కొంటూ అణచివేత చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం రాజకీయ ఏకాభిప్రాయం కూడా సాధించి వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయగలగడంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందుకు అనుసరిస్తున్న కొన్ని అంశాలను ఆయన సభలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఇంటలిజెన్స్‌ను పటిస్టం చేసి,స్థానిక ప్రజల సహకారంతో నక్సల్‌ను ఏరివేస్తున్నామని చెప్పారు. అలాగే నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా చేపట్టి ప్రజలను నక్సల్‌ ప్రభావం నుంచి దూరం చేయడం ద్వారా ఫలితాలను సాధిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి గెరిల్లా పోరుకు దళాలను సిద్ధం చేశామన్నారు. దీనిద్వారా విఐపిల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని సిఎం అన్నారు. ఇందుకోసం పోలీసులకు కూడా అన్ని సౌకర్యలు, వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఏదైనా ఘటన జరిగితే పోలీసుల మానసిక స్థయిర్యం దెబ్బతినకుండా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అలాగే నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక విధానం అవలంబించి అక్కడ అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రోడ్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అలాగే ఈ ప్రాంతాల్లో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను చేపట్టామని అన్నారు. దీంతో వ్యవసాయికంగా ఆ ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. అలాగే ఉపాధి అవకశాలు, ఉద్యోగ అవకాశాలు పెంచడం ద్వారా యూత్‌ నక్సల్‌గా మారకుండా చూస్తున్నామని చెప్పారు. ఓ వైపు యూత్‌కు ఉపాధి, మరోవైపు లొంగిన తీవ్రవాదులకు ఉపాధి కార్యక్రమాలు ఏకబిగిన అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు చీఫ్‌ సెక్రటరీ, కలెక్టర్‌ లెవల్‌లలో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఇంటిలిజెన్స్‌ నివేదికల ఆధారంగా తీసుకుంటున్న చర్యల కారణంగా మావోయిస్ట్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో యూత్‌ను తీవ్రవాదం వైపు మళ్లకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనివల్ల ఇతర ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్త పడ్డామన్నారు. ఈ కారణంగా తీవ్రవాదులు ప్రజా మద్దతు లేకుండా ఒంటరివారవుతున్నారని చెప్పారు. దేశ అంతర్గ భద్రతకు సవాల్‌ విసురుతున్న తీవ్రవాదల చర్యలను కంట్రోల్‌ చేయడంతో పరిస్థితులు అదుపులో ఉంచగలిగామన్నారు. తీవ్రవాదులతో కలవడం వల్ల వచ్చే నష్టాలను, కష్లాలను ప్రజలకు వివరించి వారి మనసులు మార్చగలిగామన్నారు. వివిధ వర్గాల ప్రజలను ఈ విధంగా మోటివేట్‌ చేశామన్నారు. ఇందుకోసం సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ సేవలను కూడా వినియోగించుకుంటున్నామని కిరణ్‌ చెప్పారు. దీంతో గతంతో పోలిస్తే ఇప్పుడు తీవ్రవాద చర్యలు తగ్గుముఖం పట్టాయన్నారు. సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిషాలలో తీవ్రవాద ఘటనలు జరినప్పుడు దాని ప్రభావం మా రాష్ట్రంపై పడుతోందన్నారు. అయితే అప్రమత్తంగా ఉన్న కారణంగా ఎలాంటి నస్టం జరక్కుండా చూసుకోగలుగుతున్నామని అన్నారు. గత ఫిబ్రవరిలో ఉగ్రవాదుల చర్య కారణంగా దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లతో 17 మంది చనిపోగా, వందకుపైగా ప్రజలు గాయాల పాలయ్యారని అన్నారు. చనిపోయిన కుటుంబాలకు 6 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు ప్రబుత్వ ఖర్చుతో వైద్యం అందించామన్నారు. టెర్రరిస్ట్‌ చర్యలపై నిఘా పెంచామని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఇందులో భాగంగా కూడళ్లలో 5వేల సిసి కెమరాలు ఏర్పాటు చేవామన్నారు. ప్రజల భద్రతను పటిష్టం చేసేందుకు ఎపి పబ్లిక్‌ సేఫ్టీ బిల 2013 ను తీసుకుని వస్తున్నామని చెప్పారు. ఆక్టోపస్‌ను బలోపేతం చేశామన్నారు. అయితే సోషల్‌నెట్‌వర్క కూడా ఓ సవాల్‌గా మారిందని, తీవ్రవాదులు వీటిని కూడా వారి స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. కొందరు మతాన్ని తీవ్రవాదానికి వాడుకోవడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌ను అమలు చేయాలని కోరారు. ఈ సందర్బంగా ప్రబుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. సమావేశంలో డిజిపి దినేశ్‌ రెడ్డి పాల్గొన్నారు.