ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం- సర్పంచ్ కాసాని సైదులు

కూసుమంచి జూలై   (జనం సాక్షి): మండలంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆదేశానుసారం నాయకన్ గూడెం సబ్ సెంటర్ ఆధ్వర్యంలో నాయకన్ గూడెం లో సోమవారం రోజున హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కాసాని సైదులు హాజరై ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అంటువ్యాధులు మరియు సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుండి నేటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధనతినిస్తుందని ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. ఈ క్యాంపు నందు 52 మందికి ఉచితంగా మందులు సరఫరా చేశారు ఈ కార్యక్రమంలో హెచ్

 వి. బి. జ్యోతి, ఏఎన్ఎం ఉపేంద్రరాణి, ఆశా కార్యకర్తలు సుభద్ర, లక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు