*ప్రజా గోసా – బిజెపి భరోసా*
*బైక్ ర్యాలీ సన్నాహా సమావేశం.*
మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 14
(జనం సాక్షి)
మెట్‌పల్లి పట్టణంలోని రామాలయం ఫంక్షన్ హాల్‌లో బిజెపి కోరుట్ల నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా గోసా – బిజెపి భరోసా సెప్టెంబర్ 19 నుంచి 24 వరకు కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పట్టణాలలో బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్యక్రమ నిజామాబాద్ పార్లమెంటరీ కోఆర్డినేటర్ కెవిఎల్‌ఎన్ రాజు, బిజెపి జిల్లా ఇంఛార్జ్ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, మ్యాన మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దం గంగాధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్, బిజెపి ఐటీ సెల్ జోనల్ ఇంచార్జ్ మిట్టపెల్లి సాయికుమార్, బిజెపి పార్లమెంటు జాయింట్ కన్వీనర్ గుంటుక సదాశివ్, ఇల్లెందుల కృష్ణమాచారి ,బిజెపి మెట‌్‌పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, మండల అధ్యక్షులు రాజ్‌పాల్ రెడ్డి, విజయ్, ధనుంజయ్, సత్యనారాయణ గౌడ్, యూసుఫ్‌నగర్ సర్పంచ్ తుకారాం గౌడ్, జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మీ, నియోజకవర్గ నాయకులు జేఎన్ సునిత వెంకట్, సురభి నవీన్, జిల్లా నాయకులు బత్తిని శంకర్ గౌడ్ , శ్రీధర్, యాదగిరి బాబు, శ్రీనివాస్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.