ప్రజా సంఘాలచే వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

 ములుగు జిల్లా బ్యూరో జూలై 20(జనంసాక్షి):-
తెలంగాణ లోని బహుజన ప్రజల సమస్యలపై, బహుజన భవిషత్ గురించి ఈ నెల 24 న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్ లో జరుగు బహుజన విద్యావంతుల మేధో మధన సదస్సును జయప్రదం చేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ లో గోడ ప్రతులను విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాహుజన విద్యావంతుల వేదిక తెలంగాణ కో ఆర్డినేటర్ డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ బహుజనుల సామాజిక స్థితిగతులపై,బహుజన ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలపై ఆయా రంగాల నిపుణులు పాల్గొని పత్ర సమర్పణతో పాటు ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సదస్సులో ప్రభుత్వ విద్యా రంగ సమస్యలు, సవాళ్లు- బహుజన విధానం పై మాజీ ఐ ఎ ఎస్ అధికారి ఆకునూరి మురళి, భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు-బహుజన దృక్పథం పై మాజీ రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ ఎస్.ఎన్. సాహూ, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యం, ఆరోగ్య మౌలిక వసతుల కల్పన, ఫార్మా కంపెనీల విస్తరణ పై హెచ్ ఆర్ ఎఫ్ నాయకులు డాక్టర్ ఎస్. తిరుపతి, నిరుద్యోగం, ఉపాధి కల్పన, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్, పారిశ్రామిక అభివృద్ది-బహుజన విధానంపై డాక్టర్ సిలువేరు హరినాధ్, తెలంగాణ సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు-బహుజన కర్తవ్యంపై సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి, మత మైనార్టీలు, మెజార్టీ హిందూత్వ రాజకీయాలపై ప్రముఖ సోషలాజిస్ట్ డాక్టర్ అలీఖాన్ ఫలాకీ, వ్యవసాయం, భూ సంబంధాలు, జల వనరుల ప్రాజెక్టులు-తెలంగాణ ప్రభుత్వ విధానంపై రిటైర్డ్ రెవెన్యూ అధికారి వి. బాలరాజు తదితర మేధావులు పాల్గొనే ఈ సదస్సుకు రాష్ట్రంలోని బహుజన ప్రజలు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
    ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు బి.సి జాక్ చైర్మన్ తిరుణహరి శేషు, బి.సి స్టడీ ఫోరం చైర్మన్ సాయిని నరేందర్, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు కొమ్ముల సురేందర్, తెలంగాణా అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నలిగింటి చంద్రమౌళి, ప్రముఖ న్యాయవాది, అంబేడ్కరిస్టు బండి మొగిలి, దళిత హుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, ఏకలవ్య హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి విజయ్ కుమార్, కేయు జాక్ చైర్మన్ డాక్టర్ మంద వీరస్వామి, డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదాసు సురేష్,స్వేరో స్టూడెంట్ యూనియన్ జిల్లా నాయకులు మారేపెళ్లి మనోజ్, డిబిఎస్ నాయకులు కన్నాల రవి, బిఎస్పి పచ్చిమ నియోజకవర్గం ఇంచార్జి కన్నం సునీల్, బిసి స్టడి ఫొరం నాయకులు పరకాల కుమారస్వామి, పోశాల కమాలకర్, ముంజాల మల్లేషం, ప్రబుదాస్, నల్ల రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.