ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని దుద్దిల్ల హితవు
హుజూరాబాద్ టౌన్, జూలై 21, (జనంసాక్షి):రోజువారి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్క రించడానికి అంకిత బావంతో ముందుకు రావా లని ఇటీవల కొత్తగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాజీపేట శ్రీనివాస్, తది తరులు మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబును కలిసి నప్పు డు ఆయన పై విధంగా సూచించినట్లు శ్రీనివాస్ తెెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి వరుసత్వ రాజకీ యాలకు దూరంగా నాయకత్వ లక్షణాలు కలిగిన యువరక్తానికి చోటు కల్పించాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ బ్యాలెట్ పద్దతిలో యుత్ కాం గ్రెస్‌కు ఎన్నికలు నిర్వహించే కొత్త ప్రక్రియకు అంకురార్పణ చేశారని మంత్రి అన్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణా ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వాటి పరిష్కరానికి ప్రభుత్వం పలు కార్యక్రమాల్లో ప్రభు త్వం ముందుకు వస్తున్నప్పటికి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి రానటువంటి సమస్యల పరిష్క రానికి యవజన కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయా లని, వారే తమ దృష్టి తేస్తే వెంటనే పరిష్కా రిస్తామని హామి ఇచ్చినట్లు కాజీపేట విరించారు. యువజన కాంగ్రెస్ ఎన్నికలలో గెలుపొందిన తమ కార్యవర్గాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్‌లు అభినందిం చినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు జవ్వాడీ నిఖిల్‌చక్రవర్తి, హుస్నాబాద్ అధ్యక్షుడు గజ్జెల రమేష్, కరీంనగర్ ఉపాధ్యా క్షుడు పటేల్ సుధీర్‌రెడ్డి, దీపక్, ప్రశాంత్‌లు పాల్గొ న్నారు.