ప్రజా సొమ్మును కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు

జులై 20(జనంసాక్షి)రాజోలి
—- తుమ్మిళ్ల లిఫ్టులో అసంపూర్తిగా ఉన్న పనులు
— ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వం పై మండి పడ్డారు.బుధవారం ఆయన తుమ్మిళ్ల ఎత్తి పోతల పథకాన్ని పరిశీలించారు. జీరో పాయింట్ నుండి వేసిన అప్రోచ్ కెనాల్ కు సరైన లైనింగ్ లేదని, దాని వల్ల అప్రోచ్ కెనాల్ కోతకు గురయ్యే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. కోట్ల రూపాయల ఖర్చు తో రైతుల కోసం నిర్మిచిన ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి కేవలం కాంట్రాక్టర్లు కు అప్పనంగా సొమ్మును దోచి పెడుతున్నారని విమర్శించారు. ఎత్తిపోతల పథకం లో చేసిన అన్ని పనుల్లో నాణ్యతను గాలికొదిలేసి, కేవలం కమీషన్లు, కాంట్రాక్టర్లు అనే ప్రాతిపదికన మాత్రమే పనులు జరిగాయన్నారు. పైపు లైన్ వేసే సమయంలో కూడా పాత పైపులే వాడుతున్నారని ఎంత మొత్తు కున్నా వినకుండా వాటినే వాడి వారి ఆదాయాన్ని మాత్రమే చూసుకుని రైతుల ప్రయోజనాన్ని తుంగలో తొక్కా రని అన్నారు. తుమ్మిళ్ల లిఫ్టులో ప్రధాన ప్రయోజనాన్ని ఆయకట్టు కు అందించే మూడు రిజర్వాయర్ లు ఎందుకు నిర్మాణం చేపట్టం లేదని, దానిపై స్థానిక అధికార పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రెండవ దశ పనులను ఏ మాత్రం ముందుకి కదలనివ్వకపోవటంలో కారణం ఏంటో రైతులకు తెలియచేయాల్సిందే నని డిమాండ్ చేశారు. మొదటి దశ లో భూములు కోల్పోయిన రైతులకు ఇంకా కొందరికి పరిహారం ఇవ్వకపోవడం రైతుల పట్ల ప్రభుత్వంకు ఎంత చిత్తశుద్ధి ఉందొ అర్థం అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ రెడ్డి, మాణిక్య రెడ్డి, కుమార్,దేవేంద్ర, నాగరాజు, అశోక్ రెడ్డి, శంకర్, నాగ శిరోమని, లాలూ తదితరులు పాల్గొన్నారు.