ప్రణబ్‌ పర్యటనలో అపశ్రుతి

బస చేసిన హోటల్‌ సమీపంలో పేలుడు
యథాతదంగా కొనసాగిన బంగ్లా పర్యటన
ఢాకా, (జనంసాక్షి) :రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బంగ్లాదేశ్‌ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. రాజధాని ఢాకాలో ప్రణబ్‌ బస చేసిన ¬టల్‌ సనర్‌గావ్‌ పాన్‌-పసిఫిక్‌కు సమీపంలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. భద్రతా దళాలు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ పేలుడులో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో భద్రతను పటిష్టం చేశారు. రాష్ట్రపతి బస చేసిన ¬టల్‌ చుట్టూ భారీగా బలగాలు మోహరించారు. పేలుడు జరిగిన సమయంలో ప్రణబ్‌ ¬టల్‌లోనే ఉన్నారా? లేదా? అన్నది తెలియరాలేదు. పేలుడు జరిగిన వెంటనే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ బంగ్లాదేశ్‌ ప్రధానికి ఫోన్‌ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ప్రణబ్‌ పర్యటనను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో నిరసనలు మిన్నంటాయి. 1971లో ముగ్గురు జమాతే ఇస్లామీ పార్టీ వ్యవస్థాపకులపై యుద్ధ నేరాలు మోపడం, ఇస్లామిక్‌ పార్టీ నేతకు మరణశిక్ష విధించడంతో ఆ పార్టీ శ్రేణులు 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆందోళనల మధ్యనే ఆయన మూడ్రోజుల పర్యటన ఆదివారం ప్రారంభమైంది. మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ¬టల్‌కు 50 అడుగుల దూరంలోని సార్క్‌ ఫౌంటేయిన్‌ వద్ద పేలుళ్లకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయాలని పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో ప్రణబ్‌ పర్యటన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు జరగలేదు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం సోమవారం ఆయనకు ప్రధానం చేశారు. 1971లో బంగ్లా లిబరేషన్‌ వార్‌ సందర్భంగా అందించిన సేవలకు గుర్తుగా ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు.