ప్రతిభ గల అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ప్రత్యేక చట్టం రూపొందించాలి

 పోలాడి రామారావు
మండలం జూలై (13) జనంసాక్షి న్యూస్
ప్రాతిపదికన అమలవుతున్న ప్రస్తుత రిజర్వేషన్లు ను సమీక్షకు ప్రత్యేక రాజ్యాంగ కమీషన్ ఎర్పాటు చేసి కులమత ప్రాతిపదికన కాకుండా అన్ని వర్గాల ఆర్ధిక స్థితి గతుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించుటకు పార్లమెంటు లో చర్చించి ప్రత్యేక చట్టం రూపొందించాలని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యానంతరం ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా సామాజికంగా వెనుకబడిన ఎస్సీ ఆదివాసీ గిరిజనలకు పదేండ్ల కాలపరిమతి తో విద్యా ఉద్యోగాల్లో 22 న్నర శాతం రిజర్వేషన్లను రాజ్యాంగం కల్పించిందన్నారు.. పదేళ్లకు ముగించాల్సిన అట్టి రిజ్వేషన్లను రాజకీయ పార్టీల నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏడు దశాబ్దాలకు పైగా అమలు పర్చుతూ 22 శాతం రిజర్వేషన్లను 50 శాతం కు పెంచారని దీంతో ప్రతిభా జ్ఞాన సముపార్జన ఉన్న ఓసి సామాజిక వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు నోచుకోలేక ఉద్యోగాలు పొందలేక అడ్డా మీది కూలీలుగా దుర్బర జీవితాలు గడుపుతూ గుమాస్తాలుగా మారారన్నారు. ప్రతిభావంతులు విదేశాలకు వలస బాట పట్టడంతో దేశం మేదోసంపత్తిని కోల్పోయి అభివృద్ధికి నష్టం జరిగిందన్నారు. శాస్త్ర సాంకేతిక వ్యవసాయ పరిశోధనల్లో ఇంజనీరింగ్ వైద్య రంగాల్లోను ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను ప్రతిభ ఆధారంగా మాత్రమే భర్తీ చేయాలన్నారు అప్పుడు మాత్రమే దేశాభిృద్ధికి దోహదం చేస్తుందని రామారావు అన్నారు.
 తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు మాత్రమే గురుకులాలు స్టడీ సర్కిల్లు ఎర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన ఓసి సామాజిక వర్గాల ఈడబ్లుఎస్ విద్యార్థులను విస్మరించడం సరికాదన్నారు. ఆంధ్ర లో మాదిరిగా విదేశీ విద్యా నిధి పథకాన్ని అన్నివర్గాల పేదల తో పాటు ఓసి సామాజిక ఈడబ్లుఎస్ విద్యార్థులకు తెలంగాణా లో కూడ అమలుకు పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానంలో సేంద్రియ ఆర్గానిక్ వ్యవసాయ రంగం వైపు రైతుల ను జాగృతి చేసేందుకు ప్రభుత్వాలు ప్రోత్సహించి పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రభుత్వాలే నేరుగా కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ధిక స్థితి గతుల ఆధారంగా రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు 80 శాతం సబ్సిడీ తో అన్ని వర్గాల రైతులకు అందజేయాలని  నాణ్యమైన విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు 50 శాతం సబ్సిడీ తో కల్పించాలనీ రైతు కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని,  పంటల భీమా కల్పించి వెనువెంటనే అమలు చేయాలని కోరారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకం తో అనుసంధానం చేసి  భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలన్నారు.తెలంగాణా రాష్ట్రం లో రైతు భీమా పరిమితిని 59 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.50 సంవత్సరాలు నిండిన రైతులందరికీ నెలకు రూ 5 వేల రూపాయల పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రపంచీకరణ నేపథ్యంలో మూస వ్యవసాయ రంగం నుంచి రైతులను దృష్టి మరల్చడానికి ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించి సేంద్రియ ఆర్గానిక్ వ్యవసాయ రంగం వైపు రైతుల ను జాగృతి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఆర్ధిక స్థితి గతుల ఆధారంగా అన్నివర్గాలకు విద్యా ఉద్యోగాల్లో సంక్షేమ రంగాల్లో సమన్యాయం జరిగేలా ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ఇదే అజెండా గా వచ్చే ఆగస్ట్ 20 న ఓసి సామాజిక సంఘాల సమాఖ్య అధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో న్యూ ఢిల్లీ లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు అన్ని రంగాల మేదావులు రైతు సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని పోలాడి రామారావు వెల్లడించారు