ప్రతి ఇంటి నుండి చెత్తా సేకరణ విధిగా జరగాలి

 

– జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య
వరంగల్ ఈస్ట్ ,జూలై 22 (జనం సాక్షి):
ప్రతి ఇంటి నుండి చెత్తా సేకరణ  వంద శాతం విధిగా జరగాలని జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య అధికారులతో సమావేశమై మహా నగరం వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ ఆటోల పనితీరు మొదలగు అంశాలపై సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ప్రతి  స్వచ్ ఆటో ఆయా వార్డుల నుండి 100 శాతం చెత్తా సేకరించే విధంగా రూట్ మ్యాపింగ్ చేసి, దానికనుగుణంగా ట్రిప్పులు వేసేలా సబందిత సానిటరీ ఇన్స్పెక్టర్, జవా న్ లునిత్యంపర్యవేక్షించాలని  తెలిపారు. తక్కువ చెత్త సేకరించిన ఆటో వారిపై జరిమానాలు విధించాలని ఆదేశించారు. చెత్తా సేకరించే క్రమంలో ఇంటి యజమానుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, వారిపై విచారణ జరిపి జీతభత్యాలలో కోత విధించాలని ఆదేశించారు.పారిశుద్ధ్య కార్మికులు ,ఆటో డ్రైవర్లు
 బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలని తెలిపారు. పారిశుధ్యానికి సంబంధించిన మిషన్లు, జెసిబి లు, ట్రాక్టర్లు స్వచ్ఛ ఆటోల రిపేర్లు పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలని  ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సిజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా  వ్యాధుల నివారణ నిమిత్తం సరిపడా మందులన్నీ అందుబాటులో ఉన్నాయని అన్నారు.నీటి నిల్వ ఉన్న ప్రాంతాలు, హై రిస్క్ ఏరియాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ తో పాటు దోమలు వ్యాప్తి చెందకుండా  ప్రణాళికాబద్ధంగా అన్ని డివిజన్లలో ఫాగింగ్, మందుల పిచికారి మురుగు కాలువల లో ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, సీ ఎం హెచ్ ఓ  జ్ఞానేశ్వర్, డీసీ లు జోనా, శ్రీనివాస్ రెడ్డి, ఎం హెచ్ ఓ రాజేష్, ఈ ఈ లక్ష్మారెడ్డి, డీసీ ఓ వేణుగోపాల్, పర్యవేక్షకులు దేవేందర్, ఐ టి రమేష్,శానిటరీ సూపర్వైజర్ భాస్కర్,  తదితరులు పాల్గొన్నారు.