ప్రదాని మోదీ,హోంమంత్రి అమిత్ షాలకు ఛాలెంజ్ చేస్తున్న
-ఆ18,000 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ
అభివృద్ధి కి ఇవ్వండి
-ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటాం
-ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రాధేయపడైన ఒప్పిస్తాం
-కమ్యూనిస్టు సోదరుల సాక్షి చెబుతున్నా
-ఒక వ్యక్తి కోసం 18000 కోట్లు ఇవ్వడం ఏమిటి
-ఆయన సొంతానికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి
రాష్ట్ర మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి
నల్గొండ బ్యూరో, జనం సాక్షి.
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు చాలెంజ్ చేస్తున్న చిత్తశుద్ధి ఉంటే 18 వేల కోట్ల రూపాయలను మునుగోడు నియోజకవర్గానికి కేటాయిస్తే తమ పోటీ నుండి తప్పుకుంటామని శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా సోమవారం కొరటికల్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేవలం బిజెపి రాజకీయాల కొరకే ఉప ఎన్నికలు సృష్టించారని, బిజెపి పార్టీ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన రూ 18,000 కోట్లను మునుగోడు నియోజకవర్గంలో కేటాయిస్తే తమ ఉప ఎన్నికల పోటీ నుండి తప్పుకుంటామని అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకొని పోటీ నుండి వైదొలుగుతామని అన్నారు. కమ్యూనిస్టు నేతల సాక్షిగా మాట చెబుతున్నానని దమ్ముంటే బిజెపి తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు. ఒక వ్యక్తి కోసం 18,000 కోట్ల రూపాయలను కేటాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో దిన దినాభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని, ఎలాగైనా తెలంగాణను ఇబ్బందులపాలు చేయాలని కంకణం కట్టుకొని ప్రయత్నాలు కొనసాగిస్తుందని వారి ప్రయత్నాలు ఏనాటికి సఫలం కావని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. హిందూ మతాన్ని వల్లించే బిజెపి పవర్ ప్లాంట్ కు మోకాలు అడ్డడంలో అర్థమెంటని ఎద్దేవా చేశారు.
సస్యశ్యామలం అవుతున్న తెలంగాణా లో మంటలు సృష్టించే కుయుక్తులు పన్నుతున్నారన్నారు
మోదీ, అమిత్ షాలు రాజగోపాల్ రెడ్డికి 18000 కోట్లు అప్పనంగా అప్పగించారు
హిందు మతానికి అంబాసిడర్లు అంటూ ఇతర మతాల మీద విషం చిమ్మే బిజెపి యాదాద్రి పునర్ నిర్మాణానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.మోదీ, అమిత్ షాల ద్వయం అనేక మార్లు తెలంగాణా లో పర్యటించారని,
బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చారు.గల్లీ,గల్లీ లో కేంద్రమంత్రులు తిరుగుతున్నారు కాని
ఎవరూ… ఏ ఒక్కరోజు తెలంగాణా అభివృద్ధి కి పైసా విదల్చ లేదని కేవలం పార్టీ మారినందుకు రాజగోపాల్ రెడ్డికి నజరానా గా మాత్రం 18000 కోట్లు ఇచ్చారు.
దేశంలో ముందున్నేడు లేని రీతిలోనల్లగొండ జిల్లా
దామరచర్ల వద్ద 30,000 వేల కోట్లతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తున్నారు.బిజెపి ఎలుబడిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పైసా ఇవ్వలేదు
వడ్డీకి అప్పులు తెచ్చి భవిష్యత్ తరాలకు విద్యుత్ సరఫరా లో ఇబ్బంది ఉండొద్ద సంకల్పంతో నిర్మిస్తున్నాం
రాజగోపాల్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం 18000 కోట్లు ఇచ్చారు
కాకతీయుల కాలం నాటి చెరువుల పునరుద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ 20,000 కోట్లు ఖర్చు పెట్టారని
ఇందులోనూ కేంద్ర సాయం సున్నాయో అని ఏద్దేవా చేసారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ఖర్చు అక్షరాల కోటి 40 వేల కోట్లు,అందులో ట్రాన్స్మిషన్,సబ్ స్టేషన్ల నిర్మాణానికి 40 వేల కోట్లు
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు పెట్టిన ఖర్చు 90 వేల కోట్లు
కేంద్రంలో ఉన్న బిజెపి నయా పైసా విదల్చ లేదు
బిజెపి కుట్రలకు అండగా నిలిచిన రాజగోపాల్ రెడ్ది కి మాత్రం 18000 వేల కోట్లు ఇచ్చారు.ఇప్పటికీ చెబుతున్న ఆ 18,000 కోట్లు మా నల్లగొండ జిల్లాకు ఇవ్వండి,మా మునుగోడు కు ఇవ్వండి
మునుగోడు నియోజకవర్గ పరిధిలో
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాని అన్నారు. ప్రచార కార్యక్రమంలో తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎం పి బడుగుల లింగయ్య యాదవ్. మోత్కుపల్లి నర్సింహులు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఐ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు