ప్రధానితో పిచాయ్ భేటి
న్యూఢిల్లీ,డిసెంబర్17(జనంసాక్షి): భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం భేటీ అయ్యారు. ఇరువురు పలు అంశాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. మోదీ ‘మేకిన్ ఇండియా’ నినాదం ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం జైట్లీ,రవిశంకర్ ప్రసాద్‌లను కలిశారు. ఇండియాలో ప్రాజెక్టుల గురించి ప్రధానితో పిచాయ్ చర్చించినట్లు సమాచారం. అంతకుముందు పిచాయ్ దిల్లీలోని ఎస్‌ఆర్‌సీసీ కళాశాల విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వారితో ఉల్లాసంగా గడిపారు. ఇదిలావుంటే ప్రధాని నరేంద్రమోడీ 250మంది పోలీసు ఉన్నతాధికారులతో కలిసి యోగా సెషన్‌లో పాల్గొననున్నారు. కచ్ ప్రాంతంలో రేపటి నుంచి డీజీ సదస్సు ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సులో ప్రతీ రోజు ఉదయం ప్రధానితో కలిసి ఉన్నతాధికారులు 45 నిమిషాలపాటు యోగా సెషన్‌లో పాల్గొంటారని గుజరాత్ డీజీపీ పీసీ ఠాకూర్ వెల్లడించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ, సీబీఐ, ఐబీ, నార్కోటిక్ విభాగం, పోలీస్ ట్రైనింగ్ అకాడవిూతోపాటు డీఐజీలు, ఐజీలు, పారామిలటరీ దళాలు బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.