ప్రధానిమంత్రి అపాయింట్‌మెంట్ కోరిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం ప్రధానమంత్రి కోరారు. ఆయనను కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభిస్తే రాష్ట్రనికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలతో కలసి గ్యాస్ సమస్యపై చర్చించనున్నారు. క్యాంపు కార్యలయంలో ఇవాళ విద్యుత్, గ్యాస్ సరఫరాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహజవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ, ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి సాహు, ట్రాన్సికో సీఎండీ హీరాలాల్ సమారియా పాల్లోన్నారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కేటాయించాలని ప్రధానికి మరోమారు లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు.