ప్రపంచంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో హైదరాబాద్‌

ఏ షాన్‌ హమారీ (కిక్కర్‌)

7
మొదటి స్థానంలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో

రెండో స్థానంలో మన హైదరాబాద్‌

ట్రావెలర్‌ మేగజైన్‌ వెల్లడి

హైదరాబాద్‌, నవంబర్‌ 28 (జనంసాక్షి) : ప్రపంచంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ ట్రావెల్‌ పబ్లికేషన్‌ సంస్థ వెల్లడించింది. 2015 సంవత్సరానికిగానూ.. ప్రపంచంలో అత్యంత చూడదగ్గ ఉత్తమమైన 20 ప్రదేశాలను ఎంపిక చేస్తే అందులో మొదటి స్థానంలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిిస్కో నగరం, రెండో స్థానంలో హైదరాబాద్‌ నగరం చోటు దక్కించుకుందని జాతీయ భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేసే ట్రావెలర్‌ మేగజైన్‌ 2014 డిసెంబర్‌ – 2015 జనవరి సంచికలో పేర్కొంది. ఎంపిక చేసిన ఉత్తమ 20 నగరాల జాబితాను కూడా విడుదల చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్న నగరాలు వరుసగా.. స్విట్జర్‌ల్యాండ్‌లోని జెర్మాట్‌, వాషింగ్‌టన్‌ డిసి, కోర్సికాలోని జాతీయమాల్‌, పెరూలోని చొకీకైరో, ఛానెల్‌ ఐస్‌ల్యాండ్‌లోని సార్క్‌, జపాన్‌లోని కోయాసన్‌, రుమేనియాలోని ఓక్లాహోమా సిటీ, మారామురేస్‌ నగరాలు నిలిచాయి.

హైదరాబాద్‌ను పాలిస్తున్న చివరి నైజాముల కాలానికి చెందిన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అనే వ్యక్తి భారత దేశంలోని దక్షిణ, తూర్పు ప్రదేశాల నుంచి ప్రపంచంలోని ధనిక పురుషులలో ఒకరుగా ఉండేవారని, ఆయన హైదరాబాద్‌పై పలు కవితలు రాసేవారని పిరియాడికల్‌ చెప్పారు. అలాంటి గొప్ప నేతలను కలిగి ఉన్నది హైదరాబాద్‌. అందుల్ల ప్రస్తుతం హైదరాబాద్‌ నగరం ప్రపంచంలోని అనేక ఐటి బ్రాండ్లకు సారవంతమైన నేలగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్‌లోని తాజ్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌, ఇరానీ కేఫ్‌లు, ఐదోతరం ముత్యాల వ్యాపారాలతో హైదరాబాద్‌ ప్రపంచానికి ఆకర్షణగా నిలిచింది. దీనివల్ల ప్రపంచం మొత్తం హైదరాబాద్‌ గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది. ఈ హైదరాబాద్‌ నగరం ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యివస్థీకరణ చట్టం-2014 ప్రకారం పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆతర్వాత ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానిగా పూర్తిస్థాయిలో మారిపోతుందని మేగజైన్‌ పేర్కొంది.