ప్రపంచానికి అహింసా,శాంతిని నేర్పించిన భారత జాతిపిత మహాత్మా గాందీ జయంతి వేడుకలు.
కోటగిరి అక్టోబర్ 2 జనం సాక్షి:- సత్యాగ్రహం,
అహింసే ఆయుధంగా బ్రిటిష్ వారి పాలన నుండి అఖండ భారతావనికి స్వేచ్చ స్వాతంత్ర్యాలు అందించిన భారత దేశ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీ యుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి జైజై కారాలు చేస్తూ వారిని ఘనంగా స్మరించుకొనీ నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుసేన్,ఎంపీటీసీలు కొట్టం మనోహర్, గంగాధర్ దేశాయ్,సీనియర్ నాయకులు సాబేర్ భాయ్,కాయపల్లి లక్ష్మణ్,కూచీ సుభాష్, ఎముల నర్సయ్య,వాహిద్,భూమయ్య,శంకర్, ఆనంద్, అయుబ్,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.