ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి : జిల్లా కలెక్టర్ శ్రీహర్ష
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : వర్షకాలం ఉన్నందున ఆసుపత్రికి వచ్చే రోగులకు డాక్టర్స్ అందరు అందుబాటులో ఉండి సరి అయిన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.
బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్స్ అందరు టైం ప్రకారం విదులలో ఉండాలని, తప్పని సరిగా డ్యూటీ టైం పాటించాలని , ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి లోని వార్డులు, పరిసరాలు పరి శుబ్రంగా ఉండే విదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో జరిగే కాన్పుల సంఖ్య పెంచాలని, తల్లి బిడ్డల మరణాలు తగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి గర్భవతి కి పిడియాట్రిషణ్ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.
సమావేశంలో జిల్లా వైద్యాదికారి చందు నాయక్, ఆసుపత్రి సుపరింతెన్దేంట్ కిషోర్ కుమార్ , గైనకాలజిస్టులు వరలక్ష్మి, అశ్విని, నర్మదా, హరిణి, కీర్తిని తదితరులు పాల్గొన్నారు.