ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దు…..

వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు భరోసానివ్వాలి……
 జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో, సూపరిండెంట్ లకు ఆదేశించారు.
గురువారం కలెక్టర్ శరత్  ఆకస్మికంగా జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రి మొత్తం కలియతిరిగి వార్డులను, కారిడార్ లను, ఆయా గదులన్నింటిని పరిశీలించారు. బ్లడ్ టెస్ట్ ,తదితర టెస్టులకు సంబంధించిన రిజిస్టర్ ను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అదేవిధంగా మెడికల్ కళాశాల నిర్మాణ పనుల పురోగతిని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రులకు వచ్చే రోగులకు మేమున్నామంటూ భరోసా కల్పించాలన్నారు.
 ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో  జిల్లా ఆస్పత్రి పాత భవనంలోని కొన్ని వార్డులలో, కారిడార్ లో నాలుగైదు చోట్ల చుక్కలు చుక్కలుగా నీరు కారుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆస్పత్రికి వచ్చి పరిశీలించామన్నారు. ఒక భవనానికి మరో భవనానికి మధ్య జాయింట్స్ ఉన్నచోట అక్కడక్కడ నీరు చుక్కలు చుక్కలుగా కారుతున్నట్లు గమనించామని, ఆర్ ఎం ఓ, సూపరిండెంట్ సంయుక్తంగా కారిడార్లలో  ఎప్పటికప్పుడు మనుషులను పెట్టి క్లీన్ చేయి స్తున్నట్లు తెలిపారు. బాగున్న వార్డులలో పేషెంట్లను సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు.
 ఇట్టి సమస్య శాశ్వత పరిష్కారానికి ఆర్ అండ్ బి, టి ఎస్ ఐ ఎం ఐ డి సి  ఈ ఈ లతో చర్చించి తక్షణ పరిష్కారం దిశగా చర్యలు చేపట్టనునట్లు పేర్కొన్నారు.
ఆస్పత్రిలోని లిఫ్ట్ కూడా గత  రెండున్నర నెలల నుండి పనిచేయడం లేదని దృష్టికి వచ్చిందన్నారు. ఈ వారంలోగా మరమ్మత్తులు చేసి రోగులకు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని  తెలిపారు. ఆస్పత్రి పరిసరాల పరిశుభ్రత మరింత బాగుండాలని కలెక్టర్ సంబంధిత  ఏజెన్సీకి  స్పష్టం చేశారు.
ఆసుపత్రిలో వైద్యులు వైద్య సిబ్బంది రోగులకు అందిస్తున్న సేవలు బాగున్నవని, ఆస్పత్రి అంతా పరిశుభ్రంగా ఉందని కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.
మెడికల్ కళాశాల పనుల పురోగతిని పరిశీలించారు. పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
డా. అనిల్ కుమార్,  ఆర్ అండ్ బి, టి ఎస్ ఐ ఎం ఐ డి సి ఈ ఈ లు, రెవిన్యూ డివిజనల్ అధికారి, డాక్టర్లు తదితరులు ఉన్నారు.
డా. అనిల్ కుమార్,  ఆర్ అండ్ బి, టి ఎస్ ఐ ఎం ఐ డి సి ఈ ఈ లు, రెవిన్యూ డివిజనల్ అధికారి, డాక్టర్లు తదితరులు ఉన్నారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజార్షి షా, ఆస్పత్రి సూపరిండెంట్