ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలి… అడిషనల్ డైరెక్టర్ మెడికల్ డాక్టర్ అమర్ సింగ్

రాజాపేట,  అక్టోబర్21 ( జనం సాక్షి) :   ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో వివిధ చికిత్సల కోసం వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ హెల్త్ మెడికల్ అడిషనల్ డైరెక్టర్ మెడికల్ డాక్టర్ అమర్ సింగ్ సూచించారు. శుక్రవారం రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు. ఆస్పత్రిలో ఉన్న రోగులతో సంభాషించారు. మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఫైలేరియా హైడ్రోసెల్ క్యాంపులు నిర్వహించాలని వైద్య అధికారిని ఆదేశించారు. ఫోన్ లో ఏఎన్ఎం తో మాట్లాడి ఎండి ఏ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నారు. ధృవీకరించబడిన ఎండి ఏ యాక్షన్ ప్లాన్, వాలంటీర్ జాబితా, ఫైలేరియాసిస్ లైన్ జాబితా కేసులు, ఏ ఈ ఎఫ్ ఐ వివరాలు తీసుకున్నారు.
టాబ్లైట్ డి ఈ సి మరియు అల్బెండజోల్ తీసుకున్నవారిలో రియాక్షన్ గురించి తెలుసుకొని, ఇంటి గుర్తులను పరిశీలించారు. ఆయన వెంట డాక్టర్ వినోద్, డాక్టర్ భరత్ కుమార్, ప్రేమ లత, మంజులత, శ్రీకాంత్,మధు , జానకిరామ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.