ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
అయిజ,జులై 14 (జనం సాక్షి):
బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రరెడ్డి మాట్లాడుతూ. ఐజ మండలంలో 12 ప్రభుత్వ పాఠశాలలు  మరియు 10 ప్రైవేట్ పాఠశాలలు, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు నాలుగు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి.అలాగే అయిజ చుట్టుపక్కల మండలాలైన మల్దకల్, గట్టు, ఇటిక్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల లు మరియు ప్రభుత్వ పాఠశాలలో వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక అయిజ మండలంలోని ఇంటర్ పాసై ఉన్నత తరగతుల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేవాళ్లు 1000 మంది పైగా ఉన్నారు. జిల్లాలోని జిల్లా కేంద్రం గద్వాల తర్వాత అతిపెద్ద పట్టణమైన ఐజ పట్టణంలో సుమారు 40 వేల జనాభాకు పైగా ఉన్న ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం శోచనీయం. కావున వెంటనే ఐజా పట్టణానికి వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుచున్నాము
 అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం 3 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు  తక్షణమే స్పందించి  కళాశాల ఏర్పాటుకు చొరవ చూపాలి లేనిపక్షంలో అఖిలపక్ష నాయకులతో, అన్ని విద్యార్థుల సంఘాల తో తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని జిల్లా అధ్యక్షులు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదన్న , సీనియర్ నాయకులు మెడికల్ తిరుమల్ రెడ్డి ,పట్టణ అధ్యక్షులు నరసింహయ్య శెట్టి ,మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు శిల్పా నవీన్ కుమార్ ,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ,బిజెవైఎం పట్టణ అధ్యక్షులు అంజి స్నేహ టిఫిన్ సెంటర్,మండల ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, చిన్నోనిపల్లి శారద,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.