ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

విజయనగరం, జూలై 20 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి రంగ సమస్యలపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న జరిగిన బంద్‌ సందర్భంగా పలు చోట్ల వంద మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం నాడు సమాఖ్య జిల్లా కార్యదర్శి జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యాన కోట జంక్షన్‌ వద్ద రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గణేష్‌, నాయకులు విజయ్‌, గాంధీ, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.