ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్
జహీరాబాద్ జులై 15 (జనంసాక్షి)ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ అని
టీపీసీసీ నాయకులు వై.నరోత్తం అన్నారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి కోహిర్ మండలం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పెద్ద వాగు చెరువు చిన్న వర్షానికే నిండిపోయింది కానీ ప్రయోజనం లేకుండా పోయింది అన్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో గల నారింజ ప్రాజెక్ట్ తర్వాత అతిపెద్ద రెండవ ప్రాజెక్ట్ పెద్దవాగు ప్రాజెక్ట్,ఇది రెండు కాలువలతో 6 గ్రామాలు అవి గొడిగార్ పల్లి,మల్చల్మా,సేడాగుట్ట తాండ,మల్చ ల్మా తాండ,జాడిమల్కాపూర్,పర్శపల్లి, మొత్తం ఆయకట్టు 1100+300=1400,ఎకరాలు సాగు కావాల్సింది, కానీ రోడ్డు కాలువలు చెడిపోయినవి లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తానికి బంద్ కావడం జరిగింది అన్నారు.ఈ ప్రాజెక్ట్ క్రింద ఒక ఎకరానికి కూడా నీళ్లు పారే పరిస్థితి లేదు.గత కొన్ని సంవత్సరాల నుండి ఇ విధంగా జరుగుతున్న ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు ఏమి చేస్తున్నట్లు,ప్రభుత్వం మిషన్ కాకతీయ,కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి లక్షల కోట్లు వెచ్చిస్తున్నారు కానీ ఉన్న ప్రాజెక్ట్ ను స్వల్ప మరమ్మత్తులు చేస్తే ఈ 6 గ్రామాలకు మేలు జరుగును అన్నారు.ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు,అధికారులు ఎందుకు ఆలోచించడం లేదు,చెరువుల కొరకు ఇక్కడ నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు, క్రింది స్థాయి సిబ్బంది తో కార్యాలయం నిర్వహిస్తూన్నారు అన్నారు వీరికి నెలకు సుమారు 15 నుండి,20 లక్షల ప్రభుత్వ ధనాన్ని ఖర్చుపెట్టడం ఇది కేవలం చూస్తూ ఉరికే కూర్చోవడా నికేనా,చెరువుల నాళాలు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులకు విన్నవించినా ఈ రోజువరకు అధికారుల్లో స్పందన లేదు అని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పి.నాగిశెట్టి,మాజీ సర్పంచ్ శంకర్,యం.డి,యూసుఫ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు నాయక్,చెంగల్.జైపాల్ ఉన్నారు.
Attachments area