ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రజాజీవనం అస్తవ్యస్తం
కాంగ్రేస్ నాయకుల చేయూత
ఫోన్ ద్వారా కాలనీ వాసులకు మాట్లాడిన డి.సి.సి అధ్యక్షులు రామారావు పటేల్
సూర్య మేజర్ న్యూస్; కుబీర్ మండలం సోనారి గ్రామంలో భారీ వర్షాలతో పలు కాలనీలలోని ఇండ్లలలో పూర్తిగా నీళ్లు చేరి నిత్యావసర సరుకులు పూర్తిగా పాడైనాయి,రాత్రి వేళల్లో పడుకోవడానికి కూడా సరైన వ్యవస్థ లేకుండా పోయి0ది. వీళ్లకు స్పందించే నాయకులే కరువైనారు.విషయం తెలిసిన వెంటనే కుబీర్ మండల కాంగ్రెస్ నాయకులు,మైనార్టీ అధ్యక్షుడు జవేద్ ఖాన్,యూత్ అధ్యక్షుడు కనకయ్య,విట్ఠల్, నాగేందర్,
తదితరులు వారి నివాస స్థలాలకు వెళ్లి, పూర్తిగా ప్రతి ఇంటిని పరిశీలించి ఫోన్ ద్వారా పై అధికారులకు సమస్యను వివరించారు.వెంటనే సోనారి గ్రామంలోని నీటిలో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్న సామాన్యులకు తక్షణమే వారికి సదుపాయం,నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కోరారు.ఏదైనా జాప్యం జరిగితే అందోళన చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు రామారావు పటేల్ సోనారి పరిస్థితులగూర్చి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆయన కాలనీవాసులకు ఫోన్ మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు జావిద్ ఖాన్, యూత్ అధ్యక్షుడు కనకయ్య, విట్టల్, నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area