ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్ లు అందించాలి-

కలక్టర్ కార్యాలయం ముట్టడికి
ఏస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్
జనగామ (జనం సాక్షి)జులై6:పాఠశాలలు ప్రారంభం అయ్యి రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు అన్ని పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్ రాలేదని ఏస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించి రెండున్నర గంటల పాటు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మన ఊరు మన బడి కార్యక్రమం లో వస్తున్న ఫండ్ నీ సరిగ్గా ఉపయగించవచ్చు అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చాలా పోస్టు లు  ఖాళీగా ఉన్నాయని అన్నారు పుస్తకాలు యూనిఫామ్ అందించకుండా ప్రభుత్వం పేద విద్యార్థులతో చలగాటం ఆడుతోందని అన్నారు ….అదే విధంగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రణ కోసం రాష్ట్రస్థాయిలో చట్టాన్ని కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు గత ఏడాది నుంచి 50 శాతం ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని, ఒకే పేరుతో అనేక బ్రాంచీలు పెడుతూ విద్య వ్యాపారంను ప్రోత్సహిస్తున్నాయి. ఇరుకైన గదులలో స్కూళ్లను నడుపుతూ ఫైర్ సేఫ్టీ లేకుండా ఉన్నాయని, పాఠశాలలను ఆధునిక దుకాణాలుగా మార్చి బుక్స్, యూనిఫామ్స్, బెల్టు, టై నోట్ బుక్స్ అమ్ముతున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని అన్నారు.  ఫీజుల నియంత్రణ కోసం రాష్ట్రస్థాయిలో చట్టాన్ని కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తక్షణమే సమస్యలు పరిష్కారం చూపాలని లేని యెడల వారంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హెచ్చరించారు… అనంతరం డి డి ఇ ఓ హామీతో నిరసన ముగింపు పలికారు.  ఈ కార్యక్రమంలో ఏస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు తరుణ్ నాయక్, యాకాన్న, అంజలీ, యాకు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు

తాజావార్తలు