ప్రభుత్వ భూవివరాలను నమోదు చేయాలి
నల్లగొండ,డిసెంబర్15(జనంసాక్షి): జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే భూములను సేకరించాలని జేసీ నారాయణరెడ్డి ఆర్డీఓలు, తహసీల్దార్లకు సూచించారు. సర్వేలో గుర్తించిన ప్రభుత్వం భూములను ల్యాండ్‌బ్యాంక్ కింద నమోదు చేసేలా చూడాలన్నారు. భవిష్యత్లో ఎక్కడ ఏ అవసరమొచ్చినా
భూమి వాడుకునే విదంగా దానిని సంరక్షించలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు ప్రభుత్వ భూమి అవసరం ఉందని అం దుకు అనుగుణంగా భూములను గుర్తించాలని సూచించారు.కార్యాలయాల నిర్మాణానికి, ఇతర అవసరాలకు ఎంత భూమి అవసరముందో తెలియజేయడం జరిగిందన్నారు. అధికారుల కోరిన మేరకు అందుబాటులో గల భూమిని కేటాయించడం జరుగుతుందని, మిగిలిన భూమిని వివిధ మండలాల్లో గుర్తించాలని సూచించారు. ఇదిలావుంటే డిండి ప్రాజెక్టు పరిధిలోని శివన్నగూడెం, చింతపల్లి, సింగరాజుపల్లి, గొట్టిముక్కల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలో ముంపుకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఆర్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని జేసీ అధికారులకు సూచించారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందజేస్తామని అందుకు తగిన విధంగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. భూసేకరణపై ప్రగతి నివేదికలపై చర్చించి రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.