ప్రభుత్వ రంగంలో అదనపు విద్యుత్‌ ఉత్పత్తి

జెన్‌కోకే బాధ్యతలు రూ.3800 కోట్లతో కొత్తగూడెంలో 800మెగావాట్లు రూ.4200 కోట్లతో బీహెచ్‌ఈఎల్‌ 1080 మెగావాట్లు నిర్ణీత సమయంలో పూర్తి చేయండి-సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): తెలంగాణను మూడేళ్లలో కరెంట్‌ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జెన్‌కో, భెల్‌పై ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, మణుగూరు ప్లాంట్ల నిర్మాణం పురోగతని కేసీఆర్‌ సవిూక్షించారు. త్వరగా ఉత్పత్తి 1ప్రారంభించి వ్యవసాయానికి కోతలు లేకుండా చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు సిఎం తెలిపారు. ఈ సందర్భంగా బీహెచ్‌ఈఎల్‌(భెల్‌)కు ప్రభుత్వం తొలి విడత నిధులను విడుదల చేసింది. రూ. 350 కోట్ల చెక్కును బీహెచ్‌ఈఎల్‌ సీఎండీ ప్రసాదరావుకు సీఎం కేసీఆర్‌ అందజేశారు. తెలంగాణ రాష్టాన్న్రి మూడేళ్లలో కరెంట్‌ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన నేపథ్యంలో జెన్‌కో, భెల్‌పై చాలా బాధ్యత ఉందని చెప్పారు. తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుకు సంబంధించి నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ రంగమే పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని తెలిపారు. నల్లగొండ జిల్లాలో నిర్మించనున్న పవర్‌ ప్లాంట్లకు త్వరలోనే పర్యావరణ అనుమతులు సాధిస్తామన్నారు.నల్గొండ జిల్లాలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి అనుమతులు సాధిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. రెండేళ్లలో మణుగూరు ప్రాజెక్టు సిద్ధమవుతుందని, మూడేళ్లలో కొత్తగూడెం ప్రాజెక్టు సిద్ధమవుతుందని బదల్‌ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లో పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. వ్యవసాయం తమ ప్రభుత్వానికి ప్రాధాన్యరంగమని సీఎం చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం మూడో ప్రాధాన్య రంగమని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఏదైనా పథకానికి సర్వే చేయాలంటే సరైన సామాన్లు కూడా ఉండేవి కావని అన్నారు. వాటర్‌గ్రిడ్‌ వంటి పథకాలను మన ఉద్యోగులపై నమ్మకంతోనే ప్రభుత్వం ఆధ్వరంలోనే చేపడుతున్నామని కేసీఆర్‌ చెప్పారు. సొంతంగా విద్యుత్‌ ఉత్పత్తిని సాధించాలన్నదే తమ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగానే భెల్‌ను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.