ప్రభుత్వ సంక్షేమ పథకాలు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

టేకులపల్లి, అక్టోబర్ 20( జనం సాక్షి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రక్తపోటు,షుగర్ వ్యాదిగ్రస్తులకు మెరుగైన చికత్స అందజేయాలనే సదుద్దేశంతో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశానుసారంలో భాగంగా గురువారం టేకులపల్లి మండలం,బేతంపూడి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఉచిత మందుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య చేతుల మీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో, మండలానికి మంజూరు కాబడిన నాలుగు లక్షల చేపపిల్లలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో చైర్మన్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వారికోసం ప్రభుత్వమే భరిస్తూ ఉచితంగా మందులను పంపిణీ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. అదేవిధంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చేప పిల్లలను అభివృద్ధి చేసుకొనుటకు ప్రభుత్వం అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సులానగర్ పీ.హెచ్.సీ వైద్యులు డాక్టర్ విరుగు నరేష్, ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ తార, హెల్త్ కమ్యూనిటీ ఆఫీసర్ సీతమ్మ, హెల్త్ అసిస్టెంట్ రమేష్,ఎంపీపీ భూక్యా రాధా,సర్పంచులు కోరం ఉమా, బోడా నిరోషా,వీసాల ఉపేందర్,మాడే మధు,యధళ్ళపల్లి బాబు,ఎంపీటీసీ జాలాది అప్పారావు, నాయకులు మోకాళ్ళ పోశాలు,ఈది గణేష్,బోడా మంగీలాల్నాయక్, మూడ్ సంజయ్,భూక్యా సైదులు,గడ్డం మధు రెడ్డి,రావూరి సతీష్,అంగన్వాడి సూపరవైజర్లు తదితరులు పాల్గొన్నారు.