*ప్రభుత్వ స్కూల్ హాస్టల్ లో దోమల నివారణ కు పైరిత్రము మందు పిచ్చికారీ*

పెబ్బేరు జులై 21 ( జనంసాక్షి ):
 పెబ్బేరు  కస్తూరిబా గాంధీ విద్యాలయం లో పైరిత్రము మందు ను పిచికారి చేసి ప్రారంభించారు మునిసిపల్ చైర్మన్ కరుణ శ్రీ సాయినాథ్, వైద్య అధికారి డాక్టర్ సాయి శ్రీ .సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అదేశాల మేరకు మున్సిపాలిటీ లో   కస్తూరి బా గాంధీ విద్యాలయం, మహాత్మా జ్యోతి రావు పులే విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్, బిసి హాస్టల్ లలో దోమల నివారణ కొరకు ప్రతి తరగతి గదులలో మరియు డార్మినటెరీ గదుల లో పైరిత్రము మంది పిచ్చికారి చేయడం జరిగిందని అన్నారు. అలాగే విద్యార్థులకు వ్యక్తిగత  ఆరోగ్య పరిశుభ్రత పై శ్రద్ధ వహించాలని తెలిపారు.
 కార్యక్రమము లో మున్సిపల్ కమిషనర్ జాన్ కృపాకర్, ఇన్వార్మెంట్ ఇంజనీర్ యోగేష్ కుమార్, హెల్త్ సూపర్ వైజర్ వెంకట్ సుబ్బమ్మ, సూర్య నారాయణ, హెల్త్ అసిస్టెంట్ లు రాజశేఖర్, లక్ష్మి రెడ్డి, గంధము రాజు, సురేష్ గౌడ్, లక్ష్మణ ,  మౌనిక, ఆశ కార్యకర్త నాగ లక్ష్మి, పాల్గొన్నారు.