ప్రమాణా స్వీకారానికి ముందే రంగంలోకి బైడెన్ టీమ్
ప్రాధాన్యాంశాలను గుర్తించే పనిలో పడ్డ సభ్యులు
వాషింగ్టన్,నవంబర్9(జనంసాక్షి): అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకో మారు రెండు నెలల ముందే జరుగుతాయి. జనవరి 21న అధ్యక్షుడి ప్రమాణస్వీకారం ఉంటుంది. అంతకు ముందు అంటే నవంబర్ 3న ఎన్నికలకు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న డెమాక్రాట్ జో బైడెన్, కమాలాహారిస్ జోడీ అధ్యక్ష,ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికయ్యారు. జనవరి 21 వరకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పాలన కొనసాగుతుంది. అయితే బైడెన్ పగ్గాలు చేపట్టకముందే తన ప్రాధాన్యాలను ప్రకటించారు.బైడెన్ ప్రమాణ స్వీకారం ముందే పని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పనితీరును సవిూక్షించేం దుకు నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ విభాగాలకు సంబంధించిన బడ్జెట్, ఉద్యోగులు, వివాదాలు, ఇతర నిర్ణయాలను ఈ బృందాలు సవిూక్షిస్తాయి. అధికార మార్పిడి సమయంలో పాలనావ్యవహారాలు కుంటుపడకుండా, సజావుగా మార్పిడి జరిగేలా చూస్తాయి. కీలక స్థానాల్లో ఉద్యోగుల బదిలీలతో పాటు, అవసరమైన చోట కొత్త ఉద్యోగుల నియామకాలను పర్యవేక్షిస్తాయి. అలాగే, ఈ విధుల పర్యవేక్షణకు ‘బిల్డ్‌బ్యాక్‌బెటర్.కామ్’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. ఇకపోతే అగ్రరాజ్యానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా తొలి నల్లజాతీయురాలు, తొలి ప్రవాస భారతీయురాలు ఎన్నిక కావడం విశేషం. మహిళా హక్కుల కోసం ఉద్యమించడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. అమెరికాలో1913లో ఏర్పాటైన రాజకీయ సంస్థ ది నేషనల్ వుమెన్ పార్టీ తెలుపు, వంగపండు, బంగారం రంగుల్ని మహిళా ఉద్యమానికి ప్రతీకగా ఎంచుకుంది. అందులో తెలుపురంగు స్వచ్ఛతకి ప్రతిబింబంగా నిలుస్తుంది. అలా తెల్లరంగులో రాజహంసలా ఈ దేశానికి తాను తొలి మహిళా అధ్యక్షురాలిని అని, కానీ తాను చివరి మహిళని కాదు అంటూ కమలా హారిస్ ప్రకటించారు. కష్టపడే తత్వం, తల్లి చెప్పిన మాటల్ని జీవితంలో తుచ తప్పకుండా ఆచరించడం, అంతులేని ఆత్మవిశ్వాసం ఆమెని ఉపాధ్యక్ష పీఠానికి దగ్గర చేశాయి.కమల తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి సంరక్షణలోనే కమల పెరిగారు. ఆమె గుణాలు పుణికిపుచ్చుకొని జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలస వాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, అద్భుతమైన నాయకత్వ లక్షణాల్ని సొంతం చేసుకున్నారు. అమెరికా మమ్మల్ని నల్లజాతివారిగానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే నన్ను, మా చెలలలెల్ని ఆత్మవిశ్వాసంతో పెంచారు. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతానుఅని కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్ వి ¬ల్డ్‌లో రాసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్‌ను పెళ్లాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిని సొంత పిల్లల్లా పెంచారు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని డిస్టిక్ట్ అటార్నీగా. రాష్ట్ర అటార్నీ జనరల్‌గా తన సత్తా చాటారు. అద్భుతమైన వాక్పటిమతో మంచి లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2016లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున సెనేట్‌కి ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత అమెరికాకి అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్‌తో పోటీ పడి గత ఏడాది చివర్లో రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడెన్‌కు మద్దతుగా నిలిచి ఉపాధ్యక్ష పదవిని చేజిక్కించు కున్నారు. ఒక సెనేటర్‌గా ఆమెలో నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి ఎప్పుడో తెలిశాయి. ఇంటెలిజెన్స్, జ్యుడీషియరీ విభాగాల్లో మంచి పట్టున్న ఆమెకు మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం ఉంది. మొత్తంగా ఈ ఇద్దరి జోడీ అమెరికాను కొత్త తీరాలకు చేరుస్తుందన్న నమ్మకం ఏర్పడింది.