ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు ఎస్పి శరత్ చంద్ర పవర్
మహబూబాబాద్ ఆగస్టు 7 జనం సాక్షి
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పేర్కొన్నారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు ఆయన పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు పరీక్ష ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూజిల్లా వ్యాప్తంగా ప్రిలిమినరీ రాత పరీక్షకు 3458 మంది గాను,3214 హాజరయ్యారని ఆయన తెలిపారు కాగా
ఎస్సై రాత పరీక్ష ను మొట్టమొదటిసారి మహబూబాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నందున జిల్లా లొమొత్తం 9 సెంటర్లలో కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.పరీక్ష కేంద్రాల దగ్గర నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్,ఎస్సై పరీక్షల రీజినల్ కో-ఆర్డినేటర్ తొర్రూరు టీఎస్ డబ్ల్యూ ఆర్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు.పరీక్ష సెంటర్లలో అభ్యర్థుల బయోమెట్రిక్ చేయు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించామని పరీక్ష కేంద్రాల వారీగా టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ మహబూబాబాద్ కళాశాలలో 480 మందికి456 హాజరు కాగా 26 గైర్హాజర్ అయ్యారని,టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ తొర్రూరు కళాశాలో 480 మందికి442 హాజరు కాగా38 గైర్హాజర్ అయ్యారని, పరీక్షా కేంద్రం టీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ ఇనుగుర్తు కళాశాలలో 480 మంది కి 445 హాజరు కాగా. 35 మంది గైర్హాజర్ అయ్యారని,
నర్సింహులపేట పరీక్ష కేంద్రంలో 240 మంది కి 222 హాజరు కాగా.18 మంది గైర్హాజరయ్యారని,
పరీక్ష కేంద్రం టీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ మరిపెడ కళాశాలలో 480కి 448 హాజరు కాగా 32 మంది గైర్హాజర్ అయ్యారని,
గడెరుకమారెడ్డి స్కూల్ మహబూబాబాద్ లో 264 కి 248 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజర్ అయ్యారని,
మహర్షి స్కూల్ మహబూబాబాద్ లో 252 మందికి 231 హాజరు కాగా 21 మంది గైర్హాజర్ అయ్యారని,
టీ టీ డబ్ల్యూ ఆర్ ఎస్ మరిపెడ లో 396 కి 367 మంది హాజరు కాగా 29 మంది గైర్హాజర్ అయ్యారని,
ఏకశిలాఏంజిల్స్ స్కూల్ మహబూబాబాద్ లో 386 కి 357 మంది హాజరు కాగా 29 మంది గైర్హాజర్ అయ్యారని
ఎస్పీ శరత్ చంద్ర పవర్ పేర్కొన్నారు.