ప్రశ్నించేవాడు లేకపోతే.. బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది.

నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ అశోక్ కుమార్.
తాండూరు జులై 13(జనంసాక్షి)సంవత్సరాలు గడిచిన కరణ్ కోట్ రోడ్డు పనులు పూర్తి కావడం లేదని తాండూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ అశోక్ కుమార్
పేర్కొన్నారు. గౌతపూర్ నుండి కరణ్ కోట్ కు వెళ్లాలంటే ప్రజలు తీవ ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై గుంతలలో నీళ్లు నిలువ ఉండడం వల్ల వాహన దారులు భయాందోళనకు గురవుతున్నారు. సూమారు తొమ్మిది సంవత్సరలైన రోడ్డు పనులు పూర్తి కాకపోవడం దారుణం అన్నారు. గతంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మరియు మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అడ్డుకొని వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ధర్నాలు కూడా చేయడం జరిగిందని వేల్లడించారు. అయినప్పటికీ కూడా
రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా మారిందని విమర్శించారు.వర్షం తగ్గిన వెంటనే 7 గ్రామాల ప్రజలతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు