ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టకుంటే,ఉప ఎన్నికల్లో మాదిగల సత్తా ఏమిటో చూపిస్తాం.

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు గూటం విజయ్.
-వర్షాన్ని సైతం లెక్కచేయక,లక్ష్యం కొరకు మాదిగల 6వ రోజు రిలే దీక్షలు.

 

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు8(జనంసాక్షి):
ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి,ఆమోదింప చేయకపోతే మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో మాదిగల సత్తా ఏమిటో భారతీయ జనతా పార్టీకి చూపిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు గూట విజయ్ అన్నారు.సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ దగ్గర 6వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది.ఈ రిలే దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు గూట విజయ్ హాజరై మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా హామీలు ఇస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ పై మాట్లాడకుండా మౌనం వహిస్తూ తప్పించుకునే ధోరణితో ముందుకు సాగుతుందని,రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుంటే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రేపు జరగబోయే మునుగోడులో ఉప ఎన్నికల లో మాదిగల సత్తా ఏమిటో బిజెపి పార్టీకి రుచి చేస్తామని అన్నారు.
నమ్మించి గొంతు కోయడంలో బిజెపి పార్టీకి బాగా అలవాటు అయిపోయిందని అన్నారు.వర్గీకరణ కోసము గత నాలుగు ఐదు రోజులుగా బీభత్సమైన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మందకృష్ణ మాదిగ ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వర్గీకరణ సాధనకై రిలే దీక్షలు 6 రోజు విజయవంతం చేయడం జరిగినదని అన్నారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చేంతవరకు భారతీయ జనతా పార్టీని పాదయాత్రలు కానీ,ప్రచారాలు కాని,మీటింగులు గాని నడవనీయమని ఈ సందర్భంగా హెచ్చరించారు.26 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణకై ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఒక లక్ష్యంగా ఒక,సామాజిక న్యాయమైన డిమాండ్లను కోరుతూ వీలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే బిజెపి పార్టీ సెంటర్లో అధికారం వచ్చాక వంద రోజులలో వర్గీకరణ కు ఆమోదం చేసి చట్టబద్ధత కల్పిస్తామని నాడు చెప్పి నేటికీ ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మాదిగలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. మాదిగలు మోసం చేసిన ఏ రాజకీయ పార్టీ బాగు పడినట్లు చరిత్రలో లేదని,ప్రస్తుత పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా స్పందించి చట్టబద్ధత కల్పించకపోతే భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేస్తామనిహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నాగన్న, రామస్వామి,కొమ్ము మోహన్,బోనాసి రాజు,హుస్సేన్, బాలయ్య,రాములు,శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.