ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మిమ్మల్ని ఎవరడ్డుకున్నారు?

` కేసీఆర్‌ ప్రాజెక్టులు కట్టింది కేవలం కమీషన్ల కోసమే..
` పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీని బీఆర్‌ఎస్‌ ఎందుకు పూర్తిచేయలేదు?
` రూ. లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలింది
` వారు చేసిన అప్పులకు వడ్డీల కింద ఏటా రూ.16వేల కోట్లు చెల్లిస్తున్నాం
` పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పూర్తిగా రాలేదు
` ప్రాజెక్టు పూర్తి చేయకుండా పాలమూరు ప్రజలకు అన్యాయం చేశారు
` పదేళ్లలో మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు
` పెద్దపల్లి జిల్లాలో కూలిన చెక్‌డ్యామ్‌లపై విచారణ జరిపిస్తాం:మంత్రి ఉత్తమ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిజైన్‌ చేసి.. నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఆపి.. సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బీఆర్‌ఎస్‌ హయాంలో ఐదేళ్లలో వాడుకున్న నీరు 70, 80 టీఎంసీలే. రూ.1.80 లక్షల కోట్ల ప్రాజెక్టు నిరుపయోగం కావడం బీఆర్‌ఎస్‌ ఘనత. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు అనేది పదేళ్లకు అంగీకరించారు.పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీని బీఆర్‌ఎస్‌ పూర్తి చేస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా? కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ. లక్షల కోట్లు అప్పులు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల కింద ఏటా రూ.16వేల కోట్లు చెల్లిస్తున్నాం. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పూర్తిగా రాలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.5 వేల కోట్ల బిల్లులు పెండిరగ్‌లో పెట్టారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే పాలమూరు ప్రజలకు అన్యాయం చేశారు’’ అని ఉత్తమ్‌ విమర్శించారు. రూ. లక్షల కోట్లు అప్పులు చేసిన వారు ఇప్పుడు మళ్లీ రంకెలు వేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిజైన్‌ చేసి.. నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఆపి.. సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఐదేళ్లలో వాడుకున్న నీరు 70, 80 టీఎంసీలే. రూ.1.80 లక్షల కోట్ల ప్రాజెక్టు నిరుపయోగం కావడం బీఆర్‌ఎస్‌ ఘనత. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు అనేది పదేళ్లకు అంగీకరించారు. పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీని బీఆర్‌ఎస్‌ పూర్తి చేస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల కింద ఏటా రూ.16వేల కోట్లు చెల్లిస్తున్నాం. పాలమూరు` రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పూర్తిగా రాలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.5 వేల కోట్ల బిల్లులు పెండిరగ్‌లో పెట్టారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే పాలమూరు ప్రజలకు అన్యాయం చేశారని ఉత్తమ్‌ విమర్శించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్‌ చెప్పేవన్నీ అసత్యాలేనని విమర్శించారు. పాలమూరు ` రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టారని.. అయిన 90 శాతం పనులు కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు పెండిరగ్‌ బిల్లులు పెట్టిందని ఆరోపించారు. పాలమూరు ` రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్విరాన్‌మెంట్‌ క్లియరేన్స్‌ రాలేదని చెప్పుకొచ్చారు. పాలమూరు ` రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా మహబూబ్‌నగర్‌ ప్రజలను బీఆర్‌ఎస్‌ మోసం చేసిందని ధ్వజమెత్తారు సోమవారంపెద్దపల్లి జిల్లాలో మంత్రి ఉత్తమ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో కూలిపోయిన చెక్‌ డ్యాంలను పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంపుల, అడవి సోమనిపల్లి గ్రామాల్లో కూలిపోయిన చెక్‌ డ్యాంలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ పనులను నాసిరకంగా, నాణ్యతలేమితో నిర్మించినా లేదా ఎవరైనా కావాలనే ధ్వంసం చేసినట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని అన్నారు. ఈ విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని ఇప్పటికే విజిలెన్స్‌ అధికారులను ఆదేశించామని అన్నారు. రైతన్నలకు మేలు చేసే చెక్‌ డ్యాంలను ఎవరైనా కావాలని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఊపేక్షించబోమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. ’నీటి వాటాలో 71 శాతం మాకు 29శాతం ఏపీకి ఇవ్వాలని మేము పోరాడుతున్నాం. 17 జనవరి 2024, ఫిబ్రవరిలో కేఆర్‌ఎంబీకి లేఖ ఇచ్చాం. ఇరిగేషన్‌ కాంట్రాక్టర్ల లిస్ట్‌ తీయండి. కేసీఆర్‌ హయంలో లాగా ఏపీ కాంట్రాక్టర్లకు మేము ఇచ్చామా..? హరీశ్‌రావు పేరు మార్చుకుని గోబెల్స్‌ అని పెట్టుకోవాలి. కాళేశ్వరం విషయంలో పదే పదే అసత్యాలు మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాలి. తెలంగాణ ప్రజల తలను తాకట్టు పెట్టి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్‌. కాళేశ్వరం నుంచి గత ఐదేళ్లలో 70 టీఎంసీల నీళ్లను మాత్రమే ఉపయోగించారు. హరీశ్‌రావు అతి తెలివితేటలు వాడటం ప్రజలు గమనిస్తున్నారు. కృష్ణా జలాల విషయంలో 2014 నుంచి 2020 వరకు జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీల్లో కేసీఆర్‌ సంతకాలు పెట్టారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రస్తావించారు.