రాధా కృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ట
కౌటాల జనం సాక్షి..మండలంలోని తాటిపల్లి గ్రామ పం చాయతీ పరిధిలోని గోవర్హెట్టి గ్రామంలో శ్రీరాధాకృష్ణ ఆలయంలో శ్రీ రాధాకృష్ణ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా భక్తులు భారీగా తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాశీ వేదపండి తులు రామచంద్ర శర్మ, శ్రీధరశర్మ ఆధ్వర్యం లో ప్రత్యేక హోమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బడగే సంతోష్, హిందూ వాహిని జిల్లా సహ ప్రముఖ్ ఎల్ములే దత్తు, కమిటీ సభ్యులు మోగే శ్యాం, సంజయ్, ప్రవీణ్, మోరేశ్వర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.



