డీజిల్ పెట్రోల్ కోసం అవస్థలు: బంకుల్లో బారులు తీరీన ప్రజలు
మిడ్జిల్. మార్చి 25: (జనం సాక్షి)పెట్రోలు డీజిల్ పై వస్తున్న కొరత వార్తలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులలో పెట్రోలు డీజిల్ దొరకపోవడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పెట్రోల్ బంకులలో బారులు తీరారు. ప్రభుత్వం ఆందోళన చెందకూడదని ఎన్నిసార్లు విన్నవించినప్పటి కూడా ప్రజల్లో భయంతో వాహనదారులు బారులు తీరారు. రాబోయే కాలంలో ఇంధనం దొరకక చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. వాహనదారులు కొందరు అవసరానికి మించి కొనుగోలు చేసి ముందస్తుగానే పెట్రోల్. డీజిల్. నిలువ చేసుకోవడంతో అవసరమున్న వాహనదారులకు. ఇంధనం దొరకక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంధనాన్ని దిగుమతి చేసే విషయంలో చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రంలోని ఉదయం 6 గంటల నుండి పెట్రోల్ బంకలలో క్యూ కట్టి పెట్రోల్ పోయించుకోవడం జరిగింది అన్ని పెట్రోలు బంకులలో పెట్రోల్ డీజిల్ అయిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


